PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagana59635c6-74a1-47fb-9532-8cc2c9bfb8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagana59635c6-74a1-47fb-9532-8cc2c9bfb8d2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో... ఆ పార్టీని మరింత విచ్చిన్నం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ.. వైసిపి పార్టీని ఒక ఆట ఆడుకుంటుంది టిడిపి సోషల్ మీడియా. అయితే తాజాగా... ఓ సంచలన వార్తను వైరల్ చేసింది టిడిపి సోషల్ మీడియా అలాగే ఎల్లో మీడియా. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని... ప్రచారం చేస్తోంది. jagan{#}Perni Nani;Telugu Desam Party;Congress;Minister;Reddy;Bharatiya Janata Party;TDP;media;Andhra Pradesh;Pulivendula;Jagan;YCPకాంగ్రెస్‌లో వైసీపీ విలీనం... క్లారిటీ ఇచ్చేసిన జగన్ ?కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం... క్లారిటీ ఇచ్చేసిన జగన్ ?jagan{#}Perni Nani;Telugu Desam Party;Congress;Minister;Reddy;Bharatiya Janata Party;TDP;media;Andhra Pradesh;Pulivendula;Jagan;YCPWed, 26 Jun 2024 10:48:08 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో... ఆ పార్టీని మరింత విచ్చిన్నం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ.. వైసిపి పార్టీని ఒక ఆట ఆడుకుంటుంది టిడిపి సోషల్ మీడియా. అయితే తాజాగా... ఓ సంచలన వార్తను వైరల్ చేసింది టిడిపి సోషల్ మీడియా అలాగే ఎల్లో మీడియా. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారని... ప్రచారం చేస్తోంది.



మంగళవారం రోజున బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి  ఇవే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైసిపి పార్టీ విలీనం కాబోతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే పులివెందుల నుంచి నేరుగా బెంగళూరుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో..  ఈ ప్రచారాన్ని ఎల్లో మీడియా జోరుగా చేసింది. వైసిపి కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది.

 

అయితే తాజాగా ఎల్లో మీడియా ప్రచారాన్ని వైసీపీ కాంగ్రెస్  తిప్పి కొట్టింది. ఈ అంశంపై మాజీ మంత్రి సీనియర్ నేత  పేర్ని నాని స్పందిస్తూ... కాంగ్రెస్లో వైసీపీ పార్టీ విలీనం పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు. కావాలనే ఎల్లో మీడియా ఫేక్ వార్తలను సృష్టిస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి స్వభావం తెలిసిన వారు ఎవరు... ఈ వార్తలను నమ్మరని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉండడానికి కారణం కాంగ్రెస్ అని... అలాంటి కాంగ్రెస్ లో  విలీనం ఏంటని ప్రశ్నించారు.

 

బలమైన సోనియాగాంధీనే ఎదిరించిన మొనగాడు జగన్ అని...  ఏపీ ప్రజల కోసం తెగించి కొట్లాడటం తప్ప... జగన్కు ఏమీ తెలియదని వివరించారు. 2029 సంవత్సరంలో... వైసిపి మళ్లీ అధికారంలోకి రాబోతుందని... అప్పటివరకు జనాల్లోనే జగన్ ఉంటారని తెలిపారు. బెంగళూరు ప్యాలస్, జగన్ పర్యటన గురించి ఎల్లో మీడియా విషయ ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు పేర్ని నాని.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>