MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu9dfb454d-0c99-4f29-ad8d-8c80a63d05a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu9dfb454d-0c99-4f29-ad8d-8c80a63d05a2-415x250-IndiaHerald.jpgSSMB29: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్? టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా ఫైనల్ రన్ లో 250 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఓటిటి, టీవీల్లో కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఆ సినిమా పాటలు కూడా ఇప్పటికీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాను చెయ్యబోతున్నాడు మహేష్. ఈ మూవీని ఎప్పుడు మొదలు పెడతారా అనMahesh Babu{#}mahesh babu;Rajamouli;Rajani kanth;producer;August;Good news;Producer;Red chilly powder;Good Newwz;Blockbuster hit;Hollywood;Tollywood;News;CinemaSSMB29: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్?SSMB29: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్?Mahesh Babu{#}mahesh babu;Rajamouli;Rajani kanth;producer;August;Good news;Producer;Red chilly powder;Good Newwz;Blockbuster hit;Hollywood;Tollywood;News;CinemaWed, 26 Jun 2024 16:37:00 GMT  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా ఫైనల్ రన్ లో 250 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఓటిటి, టీవీల్లో కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే ఆ సినిమా పాటలు కూడా ఇప్పటికీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాను చెయ్యబోతున్నాడు మహేష్. ఈ మూవీని ఎప్పుడు మొదలు పెడతారా అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. అయితే రాజమౌళి మాత్రం అదిగో ఇదిగో అని అభిమానులని ఊరిస్తూ వస్తున్నాడు.. ఇంకా సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు కానీ ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రాబోతున్నట్లు ఓ వార్త బలంగా వినిపిస్తోంది.రాజమౌళి ఈ సినిమాను ప్రకటించి దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తున్న కూడా ప్రీ ప్రోడక్షన్ పనులు ఇంకా పూర్తి చెయ్యకపోవడం గమనార్హం.. స్క్రిప్ట్ కూడా ఇంకా సరిగ్గా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని సూపర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో వారందరికి కూడా అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.. ఆగష్టు నెలలో మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి రాజమౌళి టీమ్ రెడీ అవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇంకా అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ను పూర్తిగా మార్చేశాడు.. ఆ లుక్ కోసం సూపర్ స్టార్ బాగా కష్టపడ్డాడు.. ఇప్పటికే మహేష్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. మహేష్ బాబు బర్త్ డే రోజున ఈ సినిమాలోని ఫైనల్ లుక్ ను రిలీజ్ చెయ్యనున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ మహేష్ బర్త్డేను అలర్ట్ చేస్తున్నారు సూపర్ ఫ్యాన్స్.. ఆర్ ఆర్ ఆర్ సినిమా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలు  ఎక్కువగానే ఉన్నాయి.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>