PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------e4942ab9-02ae-446c-b695-864c9e29b02c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-----------e4942ab9-02ae-446c-b695-864c9e29b02c-415x250-IndiaHerald.jpgవైకాపా అధినేత జగన్ రెడ్డికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా నీచమైన రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మరీ ముఖ్యంగా మనుషులను భయపెట్టి రాజకీయం చేసే తీరుని మార్చుకోవాలని సూచించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలకు తావు లేదని అన్నారు. విషయం ఏమిటంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ రెడ్డి లేఖ రాసిన తీరు పైన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో లేఖలోని పలు అంశాల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. గొట్టిపాటి రవికుమార్ {#}Volleyball;K S Ravikumar;Qualification;Ishtam;Letter;politics;Cricket;Minister;Jaganఓవర్ చేశారంటే క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీమ్ అయిపోతుంది జాగ్రత్త: గొట్టిపాటిఓవర్ చేశారంటే క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీమ్ అయిపోతుంది జాగ్రత్త: గొట్టిపాటిగొట్టిపాటి రవికుమార్ {#}Volleyball;K S Ravikumar;Qualification;Ishtam;Letter;politics;Cricket;Minister;JaganWed, 26 Jun 2024 15:00:00 GMTవైకాపా అధినేత జగన్ రెడ్డికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా నీచమైన రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మరీ ముఖ్యంగా మనుషులను భయపెట్టి రాజకీయం చేసే తీరుని మార్చుకోవాలని సూచించారు.  ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలకు తావు లేదని అన్నారు. విషయం ఏమిటంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ రెడ్డి లేఖ రాసిన తీరు పైన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో లేఖలోని పలు అంశాల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే గొట్టిపాటి పై విధంగా స్పందించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇకపై బెదిరింపు రాజకీయాలకు ప్లాన్ చేస్తే తాట తీస్తామని, అదేవిధంగా తీరు మార్చుకోకపోతే క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీం కాక తప్పదు అని గొట్టిపాటి చాలా గట్టిగా జగన్ అండ్ టీం కి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించాల్సిందేనని అన్నారు. పనికిమాలిన తమ తీరుతో ప్రజలు మరలా మిమ్మల్ని అసహ్యించుకునేలా చేసుకోరాదని సలహాలు ఇచ్చారు.

అదృష్టవశాత్తు తనకి అర్హత లేకపోయినా వారు కోరిన వెంటనే జగన్ వాహనాన్ని లోనికి అనుమతించారు. అదేవిధంగా వారు కోరిన తర్వాతే మంత్రుల తర్వాత జగన్ రెడ్డికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి దొరికింది. అయినా వారి బుద్ధి మారలేదు సరి కదా సభాపతినే లక్ష్యంగా చేసుకొని స్పీకర్ కి వ్యంగ్య భాషలో లేఖ రాయడం వారి వక్ర బుద్ధికి తార్కాణం. కాబట్టి దయచేసి ఇలాంటి నీచ రాజకీయాలు మాని ముద్దుగా బతికితే ప్రజలు ఈసారైనా కనికరిస్తారేమో అని చెబుతూ గొట్టిపాటి తన ప్రసంగాన్ని ముగించారు. కాగా గొట్టిపాటి వ్యాఖ్యలు విన్న వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమయం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని గొట్టిపాటికి వార్నింగ్ ఇచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>