PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyand961709a-f600-44b2-a496-14464d67f238-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyand961709a-f600-44b2-a496-14464d67f238-415x250-IndiaHerald.jpgచెప్పులేసుకొని అమ్మవారి దీక్షేంటి పవనా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్? జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఎందుకంటే ఆయన చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ దీక్ష మొత్తం 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పPawan Kalyan{#}kalyan;Pawan Kalyan;Andhra Pradesh;Janasena;CM;Turmeric;YCP;sri reddyచెప్పులేసుకొని అమ్మవారి దీక్షేంటి పవనా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?చెప్పులేసుకొని అమ్మవారి దీక్షేంటి పవనా? ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?Pawan Kalyan{#}kalyan;Pawan Kalyan;Andhra Pradesh;Janasena;CM;Turmeric;YCP;sri reddyWed, 26 Jun 2024 16:06:04 GMT జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఎందుకంటే ఆయన చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ దీక్ష మొత్తం 11 రోజుల పాటు కొనసాగనుంది. వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ కళ్యాణ్ అందర్ని ఆకట్టుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఒక తప్పు చేసి అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు.వారాహి అమ్మవారి దీక్ష చేస్తోన్న పవన్ కల్యాణ్ చెప్పులు ధరించడం పలువురు జనాలను ఇప్పుడు షాక్‌కు గురిచేస్తుంది. పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్ష చేయడం ఇప్పుడు పెద్ద వివాదం లాగా మారింది. పవన్ కల్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించ పరచడమనే అభిప్రాయం కూడా జనాల్లో వ్యక్తం అవుతోంది. 


దీనిపై వైసీపీ నేతలు కూడా ఎంతగానో మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో హిందూమతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్‌కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అని పవన్‌ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ కల్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వరస్వామి ఫొటోను చెప్పులు వేసుకునే అందుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై శ్రీరెడ్డి స్పందించింది. పవన్ కళ్యాణ్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తోన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్' అంటూ రెండు పగలబడి నవ్వే ఎమోజిలని శ్రీరెడ్డి జోడించింది. ఇక ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష మొత్తం 11 రోజుల పాటు కొనసాగనుంది. ఈ 11 రోజులు కూడా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>