MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkis--c64c72c0-6fc4-40c4-baf2-2487ca06b4f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkis--c64c72c0-6fc4-40c4-baf2-2487ca06b4f0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎప్పుడైతే మొదలైందో అక్కడినుండి రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసినదే. కాగా వైజయంతి బ్యానర్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే రేపే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. దాంతో ఆన్లైన్ టికెట్స్ అమ్మకం రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. Kalkis {#}Cinema Tickets;vegetable market;Mahanati;Darling;Tollywood;nag ashwin;vyjayanthi;Prabhas;Indian;Telugu;vijay kumar naidu;Cinemaప్రభాస్ కల్కి సినిమా రికార్డులు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది!ప్రభాస్ కల్కి సినిమా రికార్డులు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది!Kalkis {#}Cinema Tickets;vegetable market;Mahanati;Darling;Tollywood;nag ashwin;vyjayanthi;Prabhas;Indian;Telugu;vijay kumar naidu;CinemaWed, 26 Jun 2024 15:12:00 GMTటాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎప్పుడైతే మొదలైందో అక్కడినుండి రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతున్నాయి. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసినదే. కాగా వైజయంతి బ్యానర్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే రేపే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. దాంతో ఆన్లైన్ టికెట్స్ అమ్మకం రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇక మ్యాటర్ లోకి వెళితే... కల్కి 2898 ఏడి సినిమా ఒక్క టికెట్ ధర దేశంలో గరిష్టంగా 2300 రూపాయలుగా ఉండడం ఇప్పుడు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దాంతో టాలీవుడ్ నిర్మాతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే తమ హీరోని ఈ దరిదాపుల్లో కొట్టేవారు లేరని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇకపోతే బుక్ మై షో నిర్వాహకులు ఇటువంటి ఉప్పెన మునుపెన్నడూ రాలేదని, వెబ్సైట్ హ్యాంగ్ అయిపోతుందని వాపోతున్నారు.

ఈ క్రమంలోనే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మార్క్ అందుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాకి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్లు రేట్లు పెంచిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక మొదటి రోజు ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 2,300 కి ఒక్కో టికెట్ ధర అమ్మినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఇక సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి మరి! మరోవైపు ముంబైలో కూడా కల్కి సినిమా హవా కొనసాగుతోంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు సినిమా టికెట్లు బుక్ అయిన విధానాన్ని చూసి నివ్వెర పోతున్నారని సమాచారం. ఇదే పరిస్థితి మొత్తం ఇండియన్ సినిమా పరిశ్రమలలో కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాసుకుంటాడని కూడా చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>