BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbncaf14331-6429-4235-a70b-143d419fe05b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbncaf14331-6429-4235-a70b-143d419fe05b-415x250-IndiaHerald.jpgఈనాడు సంస్థల చైర్మన్, పద్మ విభూషణ్ రామోజీ రావు సంస్మరణ సభ ను అధికారికంగా నిర్వహించడం ద్వారా చంద్రబాబు ఆయన రుణం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమం గా పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ సురేష్ కుమార్ మెమో జారీ చేశారు. రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించే సంస్మరణ సభ నిర్వహణ కోసం ఐదుగురు మంత్రులు, 12 మంది అధికారుల తో రెండు కమిటీలు వేశారు. మంత్రుల కమిటీలో సభ్యులు గా కె.పార్థ సారథి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఉన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమ cbn{#}DR NIMMALA RAMANAIDU;collector;Nimmala Ramanaidu;ramoji rao;Suresh;Vijayawada;satya;krishna district;bhaskar;Baba Bhaskar;CBN;Governmentఘనంగా రామోజీ రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు?ఘనంగా రామోజీ రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు?cbn{#}DR NIMMALA RAMANAIDU;collector;Nimmala Ramanaidu;ramoji rao;Suresh;Vijayawada;satya;krishna district;bhaskar;Baba Bhaskar;CBN;GovernmentWed, 26 Jun 2024 08:38:00 GMTఈనాడు సంస్థల చైర్మన్, పద్మ విభూషణ్ రామోజీ రావు సంస్మరణ సభ ను అధికారికంగా నిర్వహించడం ద్వారా చంద్రబాబు ఆయన రుణం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమం గా పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ సురేష్ కుమార్ మెమో జారీ చేశారు. రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించే సంస్మరణ సభ నిర్వహణ కోసం ఐదుగురు మంత్రులు, 12 మంది అధికారుల తో రెండు కమిటీలు వేశారు.


మంత్రుల కమిటీలో సభ్యులు గా కె.పార్థ సారథి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఉన్నారు.  సీఆర్డీఏ కమిషనర్ కాటమ భాస్కర్ నేతృత్వంలో  అధికారుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా కృష్ణా, ఎన్టీర్ జిల్లాల కలెక్టర్ లు, విజయవాడ సీపీ, కృష్ణా జిల్లా ఎస్పీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్, సీపీడీసిల్ సీఎండి, రహదారులు భవనాలు, సమాచార శాఖ, ప్రోటోకాల్, అగ్నిమాపక, ఉద్యాన, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పని చేయాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాదాపు 7 వేల మందిని ఆహ్వానించి అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>