PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/buddha-venkanna-vijayawada-tdp-chandrababu-mlc-db174034-9133-4fcf-9ef1-be2751c380eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/buddha-venkanna-vijayawada-tdp-chandrababu-mlc-db174034-9133-4fcf-9ef1-be2751c380eb-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఎన్నిక‌ల‌కు ముందు.. ర‌క్త త‌ర్ప‌ణం చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు విజ‌య‌వాడ వెస్ట్ సీటుకానీ.. అన‌కాప‌ల్లి ఎంపీ సీటుకానీ కావాలంటూ ఆయ‌న మారాం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆయ‌న అడ‌గ‌డంలో ధ‌ర్మం ఉంది. పార్టీ కోసం అంత‌లా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే.. చంద్ర‌బాబు నుంచి ఎలాంటి ఆహ్వానం లేక పోవ‌డం, ఎలాంటి పిలుపు రాక‌పోవ‌డంతో ఆయ‌న అలిగి.. చివ‌ర‌కు ర‌క్త త‌ర్ప‌ణం చేశారు. చంద్ర‌బాబు ఫ్లెక్సీని రక్తంతో క‌డిగారు. త‌ను విధేయుడైన పార్టీ కార్యకBUDDHA VENKANNA;VIJAYAWADA;TDP;CHANDRABABU;MLC;{#}Buddha Venkanna;MP;MLA;TDP;Party;India;Minister;CBNబెజ‌వాడ ' బుద్దా ' ర‌క్త త‌ర్ప‌ణం ఫ‌లించేనా..!బెజ‌వాడ ' బుద్దా ' ర‌క్త త‌ర్ప‌ణం ఫ‌లించేనా..!BUDDHA VENKANNA;VIJAYAWADA;TDP;CHANDRABABU;MLC;{#}Buddha Venkanna;MP;MLA;TDP;Party;India;Minister;CBNTue, 25 Jun 2024 08:36:00 GMT- ఎమ్మెల్సీ కోసం భారీ ఆశ‌లు పెట్టుకున్న టీడీపీ వెంక‌న్న‌
- పార్టీలోనే ఫిర్యాదులున్నాయా... బాబు ప‌ట్టించుకుంటారా

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఎన్నిక‌ల‌కు ముందు.. ర‌క్త త‌ర్ప‌ణం చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు విజ‌య‌వాడ వెస్ట్ సీటుకానీ.. అన‌కాప‌ల్లి ఎంపీ సీటుకానీ కావాలంటూ ఆయ‌న మారాం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆయ‌న అడ‌గ‌డంలో ధ‌ర్మం ఉంది. పార్టీ కోసం అంత‌లా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే.. చంద్ర‌బాబు నుంచి ఎలాంటి ఆహ్వానం లేక పోవ‌డం, ఎలాంటి పిలుపు రాక‌పోవ‌డంతో ఆయ‌న అలిగి.. చివ‌ర‌కు ర‌క్త త‌ర్ప‌ణం చేశారు. చంద్ర‌బాబు ఫ్లెక్సీని రక్తంతో క‌డిగారు. త‌ను విధేయుడైన పార్టీ కార్యక‌ర్త‌నంటూ ప్ర‌క‌టించుకున్నారు. అయితే.. చంద్ర‌బాబు బుద్దాకు సీటివ్వ‌లేక‌పోయారు.


ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం వ‌చ్చింది. దీంతో మాజీ ఎమ్మెల్సీ అయిన‌.. బుద్దా.. భారీగానే ఆశ‌లు పెంచుకున్నారు. పెట్టుకున్నారు కూడా. త‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతారా ? అంటూ ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద చెబుతున్నారు. అయితే.. ప్ర‌స్తుతం రెండు సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ కానున్నాయి. ఇవి కూడా ఎమ్మెల్యే ఎన్నిక‌లు జ‌రిగి.. ఇద్ద‌రు ఎమ్మెల్సీలు.. మండ‌లిలో అడుగు పెట్ట‌నున్నారు. నిజానికి గ‌తంలో చంద్ర‌బాబుకు బుద్దాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్ప‌ట్లో ఆయ‌న విజృంభించి పార్టీ కోసం ప‌నిచేశారు. బ‌ల‌మైన గ‌ళం వినిపించారు. మూడు రాజ‌ధానుల విష‌యంపై మండ‌లిలో చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది.


అయినా.. ఇప్పుడు బుద్దాకు ప‌ద‌వి ఇస్తార‌నేది డౌటే. ఎందుకంటే.. ఆయ‌న నోటి దురుసు, దూల వ్యాఖ్య‌లు వంటివి ఆయ‌న‌తో పాటు పార్టీకి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. ఇటీవ‌ల కొడాలి నానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనికి ముందు కూడా.. ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా పార్టీలో ఆయ‌న‌పై ఫిర్యాదులు అందిన‌ట్టు తెలిసింది. దీనికితోడు.. సుజ‌నా చౌద‌రిని గెలిపించ‌డంలో ముందుకు వ‌చ్చినా.. చివ‌రి నిముషంలో ఆయ‌న‌కు అందుబాటులో లేకుండా పోయార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు బుద్దా విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.


మ‌రో వైపు.. బుద్దాకు ఇప్ప‌టికిప్పుడు ప‌ద‌వి రాక‌పోవ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. ప‌వ‌న్ కోసం సీటును త్యాగం చేసిన వ‌ర్మ‌కు అర్జంటుగా ఎమ్మెల్సీ ఇవ్వాలి. మంత్రి ప‌ద‌విని కూడా.. ఆయ‌న కోస‌మే రిజ‌ర్వ్ చేశారన్న వాద‌న కూడా ఉంది. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కోటాలో దీనిని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. మ‌రో సీటును జ‌న‌సేన‌కు లేదా.. బీజేపీకి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది సో.. ఎలా చూసుకున్నా ఇప్ప‌టికిప్పుడు బుద్దా ర‌క్త త‌ర్ప‌ణానికి ఫ‌లితం ద‌క్కే అవ‌కాశం లేద‌ని పార్టీలో అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>