MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తన నిర్మాణ సంస్థ కార్యకలాపాలను చాల ప్లాన్డ్ గా నిర్వహిస్తాడని చాలామంది అంటూ ఉంటారు. దానికితోడు ఒక కథ వినగానే ఆకథ సినిమాకు ఎంతవరకు పనికి వస్తుంది అని అంచనా వేయడంలో అతడు సిద్దహస్తుడు అని ప్రతీతి. అయితే గత కొంతకాలంగా ఆయన అంచనాలు తలక్రిందులు అవుతున్న పరిస్థితులలో ప్రస్తుతం ఈపరముఖ్య నిర్మాత కూడ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్నప్రచారం జరుగుతోంది. ఈపరిస్థితుల మధ్య దాదాపు మూడు సంవత్సరాల క్రితం దిల్ రాజ్ మొదలుపెట్టిన ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికీ విడుదల అవ్వకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవGAMECHANGER{#}surya sivakumar;Diwali;December;November;Dil;Athadu;raj;producer;Producer;Mani Ratnam;Tamil;Hero;Tollywood;Newsఅష్టదిగ్బంధంలో గేమ్ ఛేంజర్ !అష్టదిగ్బంధంలో గేమ్ ఛేంజర్ !GAMECHANGER{#}surya sivakumar;Diwali;December;November;Dil;Athadu;raj;producer;Producer;Mani Ratnam;Tamil;Hero;Tollywood;NewsTue, 25 Jun 2024 15:27:00 GMTప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తన నిర్మాణ సంస్థ కార్యకలాపాలను చాల ప్లాన్డ్ గా నిర్వహిస్తాడని చాలామంది అంటూ ఉంటారు. దానికితోడు ఒక కథ వినగానే ఆకథ సినిమాకు ఎంతవరకు పనికి వస్తుంది అని అంచనా వేయడంలో అతడు సిద్దహస్తుడు అని ప్రతీతి. అయితే గత కొంతకాలంగా ఆయన అంచనాలు తలక్రిందులు అవుతున్న పరిస్థితులలో ప్రస్తుతం ఈపరముఖ్య నిర్మాత కూడ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్నప్రచారం జరుగుతోంది.



ఈపరిస్థితుల మధ్య దాదాపు మూడు సంవత్సరాల క్రితం దిల్ రాజ్ మొదలుపెట్టిన ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికీ విడుదల అవ్వకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి ఈసినిమా నిర్మాణం రకరకాల కారణాలతో ఆలస్యం జరగడంతో ఈప్రాజెక్ట్ గురించి దిల్ రాజ్ టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఎట్టకేలకు ఈసినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈమూవీని విడుదలచేయడానికి సరైన రిలీజ్ డేట్ గురించి దిల్ రాజ్ తన టీమ్ తో ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.



ఈసినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ వీలైనంత త్వరగా పూర్తిచేసి నవంబర్ లో రాబోతున్న దీపావళి పండుగకు విడుదలచేయాలని భావిస్తున్న నేపధ్యంలో ఇక్కడ కూడ ఈ ప్రముఖ నిర్మాతకు కొన్ని సమస్యలు ఎదురౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమావస్య సెంటిమెంట్ తో దీపావళినాడు టాలీవుడ్ లోని భారీ సినిమాలు విడుదల అవ్వవు. ఒకవేళ సెంటిమెంట్ ను పట్టించుకోకుండా ‘గేమ్ ఛేంజర్’ ను దీపావళి టార్గెట్ గా విడుదల చేసినా కాలీవుడ్ టాప్ హీరోలతో ‘గేమ్ ఛేంజర్’ కు సమస్యలు తప్పేలా లేవు అని అంటున్నారు.



సూర్య హీరోగా అత్యంత బడ్జెట్ తో తీసిన ‘కంగువ’ దీపావళినాడు విడుదల కాబోతోంది. ఈమూవీ రేంజ్ ‘బాహుబలి’ స్థాయిని మించి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాతో పాటు తమిళ టాప్ హీరో ‘విదముయార్చి’ దీపావళి టార్గెట్ చేస్తూ విడుదల అవుతుంది అని అంటున్నారు. ఈ రెండు సినిమాలు చాలవు అన్నట్టుగా కమలహాసన్ మణిరత్నం ల ‘ధగ్ లైఫ్’ కూడ దీపావళి రేస్ లో ఉంది. దీనితో నవంబర్ వదులుకుని డిసెంబర్ కు వళితే అక్కడ ‘పుష్ప 2 గట్టి పోటీ ఇవ్వబోతోంది. దీనితో ఈసంవత్సరం ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సరైన రిలీజ్ డేట్ దొరుకుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>