PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/those-four-in-the-ttd-chairman-racec7418697-2aa6-4149-9adb-97013bd50ce9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/those-four-in-the-ttd-chairman-racec7418697-2aa6-4149-9adb-97013bd50ce9-415x250-IndiaHerald.jpg- సినీ రంగం నుంచి ముర‌ళీమోహ‌న్‌, అశ్వ‌నీద‌త్‌ - బీజేపీ కోటాలో భానుప్ర‌కాష్ రెడ్డి - జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యే బొలిశెట్టి ( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఈవిష‌యంపై ఆయా పార్టీల నాయ‌కులు గుంభ‌నంగా చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అత్యంత కీల‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ఎప్పుడు .. ఏ ప్ర‌భ‌త్వం ఉన్నా హాట్ టాపిక్కే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ క‌నుక అధికారంలAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chairman ; jenasena; bolisetti Srinivas; murali mohan; ashwini dutt{#}bhanu;Tirumala Tirupathi Devasthanam;Bharatiya Janata Party;MLA;producer;Producer;Service;TDP;India;Reddy;YCP;Partyటీటీడీ చైర్మ‌న్ రేసులో ఆ న‌లుగురు..!టీటీడీ చైర్మ‌న్ రేసులో ఆ న‌లుగురు..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; chairman ; jenasena; bolisetti Srinivas; murali mohan; ashwini dutt{#}bhanu;Tirumala Tirupathi Devasthanam;Bharatiya Janata Party;MLA;producer;Producer;Service;TDP;India;Reddy;YCP;PartyTue, 25 Jun 2024 08:13:45 GMT- సినీ రంగం నుంచి ముర‌ళీమోహ‌న్‌, అశ్వ‌నీద‌త్‌
- బీజేపీ కోటాలో భానుప్ర‌కాష్ రెడ్డి
- జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యే బొలిశెట్టి

( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఈవిష‌యంపై ఆయా పార్టీల నాయ‌కులు గుంభ‌నంగా చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అత్యంత కీల‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ఎప్పుడు .. ఏ ప్ర‌భ‌త్వం ఉన్నా హాట్ టాపిక్కే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ క‌నుక అధికారంలో ఉంటే.. ఈ ప‌ద‌వికి మ‌రింత డిమాండ్ ఏర్ప‌డుతుంది. ఇప్పుడు కూడా అంతే డిమాండ్ ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు పై స్థాయి నుంచి సిఫార‌సులు కూడా చేయించేందుకు రెడీ అవుతున్నారు.


ముఖ్యంగా న‌లుగురు టీటీడీ చైర్మ‌న్ రేసులో ఉన్నారు. వీరిలో సినీ రంగానికి చెందిన ఇద్ద‌రు, బీజేపీ నుంచి ఒక‌రు, జ‌న‌సేన నుంచి మ‌రొక‌రి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన మాజీ ఎంపీ, నిర్మాత‌, న‌టుడు.. ముర‌ళీ మోహ‌న్‌.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే విన్న‌వించార‌ని తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌మండ్రి నుంచి ఎంపీగా విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. త‌ర్వాత గత ఎన్నిక‌ల్లో కోడ‌లు రూపాదేవిని పెట్టారు ఆమె ఓటమి త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌మాంకంలో దేవ‌దేవుడి సేవ చేస్తాన‌ని అంటున్నారు.


ఇక‌, ఇదే రేసులో సినీ రంగం నుంచి మ‌రో ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ కూడా రంగంలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న కూడా టీడీపీకి వీర విధేయుడు. గ‌తంలో విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ప్ర‌స్తుతం టీడీపీకి ఆయ‌న అంత‌ర్గ తంగా స‌హ‌క‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా.. ఈ ప‌ద‌వి కోసం రేసులో ఉన్నారు. మ‌రోవైపు.. జ‌న‌సేన నుంచి బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈయ‌న జ‌న‌సేన‌కు వాయిస్ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీలో కీల‌క చ‌ర్చ‌లు.. వాయిస్ వినిపించ‌డం లో ముందున్నారు. ఈయ‌న ఇటీవ‌ల ప‌వ‌న్‌ను క‌లిసి త‌న మ‌న‌సులో మాట చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.


ఇక‌, బీజేపీ నుంచి తిరుప‌తికే చెందిన భాను ప్ర‌కాశ్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈయ‌నకు కేంద్రంలోని పెద్ద‌ల‌తో ప‌రిచ‌యం ఉండ‌డం, గ‌తంలో తిరుమ‌ల ఆచారాలు, వ్య‌వ‌హారాల‌ను వైసీపీ భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంద‌ని ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేసిన చ‌రిత్ర ఉండ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా.. ఈ సారి దేవ‌దేవుడి సేవ‌కు త‌న‌ను నియ‌మించాల‌ని కేంద్రం పెద్ద‌ల‌కు ఇప్ప‌టికే విన్నవించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇంకా దీనిపై బీజేపీ దృష్టి పెట్ట‌లేదు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా ఈ విష‌యంలో మిత్ర‌ప‌క్షాల‌కు అవ‌కాశం ఇస్తారా?  లేక ఏం చేస్తార‌నేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>