MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rana72536548-5b40-4041-bcc1-22c6144116d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rana72536548-5b40-4041-bcc1-22c6144116d0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రానా ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన కుటుంబంలో ఒకటి అయినటువంటి దగ్గుపాటి కుటుంబం నుండి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన పెద్ద స్థాయి ఉన్న కుటుంబం నుండి వచ్చినా కూడా ఎప్పుడు ఈగో అనేది లేకుండా సినిమాల్లో కేవలం హీరో పాత్రలో నటించాలి అని అనుకోకుండా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన హీరోగా ఎన్ని సినిమాల్లో నటించాడో అంతకన్నా ఎక్కువ సినిమాలలోనే ఇతర ముఖ్య పాత్రrana{#}gunasekhar;teja;rana daggubati;News;Rajamouli;Bahubali;Prabhas;Tollywood;India;Hero;Cinemaరానా కే ఎందుకిలా జరుగుతుంది... ఆ మూవీలన్నీ ఏమయ్యాయి..?రానా కే ఎందుకిలా జరుగుతుంది... ఆ మూవీలన్నీ ఏమయ్యాయి..?rana{#}gunasekhar;teja;rana daggubati;News;Rajamouli;Bahubali;Prabhas;Tollywood;India;Hero;CinemaTue, 25 Jun 2024 18:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రానా ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన కుటుంబంలో ఒకటి అయినటువంటి దగ్గుపాటి కుటుంబం నుండి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన పెద్ద స్థాయి ఉన్న కుటుంబం నుండి వచ్చినా కూడా ఎప్పుడు ఈగో అనేది లేకుండా సినిమాల్లో కేవలం హీరో పాత్రలో నటించాలి అని అనుకోకుండా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందు వరుసలో ఉంటాడు.

అందులో భాగంగా ఇప్పటికే ఈయన హీరోగా ఎన్ని సినిమాల్లో నటించాడో అంతకన్నా ఎక్కువ సినిమాలలోనే ఇతర ముఖ్య పాత్రలలో నటించాడు. కొంత కాలం క్రితం ఈయన రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి మూవీ లో విలన్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా రానా కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు మరింత పెరిగింది. ఇలా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రానా కు సినిమాలలో హీరో పాత్రల విషయంలో ఇప్పటికీ భారీ క్రేజ్ ఉన్న దర్శకుల సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు.

ఈయన హీరోగా అనౌన్స్ అయిన సినిమాలు కూడా స్పీడ్ గా స్టార్ట్ కావడం లేదు. కొంత కాలం క్రితం గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కాశ్యప  అనే సినిమాలో రానా హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా బారి అపజయం సాధించడంతో హిరణ్య కశ్యప మూవీ కి సంబంధించిన ఎలాంటి వార్తలు బయటికి రావడం లేదు. ఇకపోతే తేజ దర్శకత్వంలో కూడా ఈయన ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తను వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు కూడా ఏమీ బయటకు రావడం లేదు. ఇక ప్రస్తుతం రానా "రానా నాయుడు" సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>