Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/infiadf88d78c-bc41-4962-bf40-792dee0bf13d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/infiadf88d78c-bc41-4962-bf40-792dee0bf13d-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన టీమిడియా అదరగొట్టింది. ఈ క్రమంలోనే తప్పకుండా టైటిల్ విజేతగా నిలుస్తుంది అని అందరూ అనుకుంటే.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో టైటిల్ కల కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్నటు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది టీమిండియా. ఏది ఏమైనా వరల్డ్ కప్ టైటిల్ గెలిచి ఇక సొంత దేశానికి తీసుకెళ్లాలని అనుకుంటుందిInfia{#}New Zealand;Champion;England;ICC T20;Australia;World Cup;India;Yevaru;Juneసెమీఫైనల్ లో.. టీమిండియా ప్రత్యర్థి ఎవరంటే?సెమీఫైనల్ లో.. టీమిండియా ప్రత్యర్థి ఎవరంటే?Infia{#}New Zealand;Champion;England;ICC T20;Australia;World Cup;India;Yevaru;JuneTue, 25 Jun 2024 13:30:00 GMTఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన టీమిడియా అదరగొట్టింది. ఈ క్రమంలోనే తప్పకుండా టైటిల్ విజేతగా నిలుస్తుంది అని అందరూ అనుకుంటే.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో టైటిల్  కల కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్నటు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది టీమిండియా.


 ఏది ఏమైనా వరల్డ్ కప్ టైటిల్ గెలిచి ఇక సొంత దేశానికి తీసుకెళ్లాలని  అనుకుంటుంది. ఇక ఇలా పట్టుదలతో ముందుకు సాగుతున్న టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఇప్పుడు వరకు ఒక్క ఓటమి లేకుండా వరల్డ్ కప్ ప్రస్తానాన్ని కొనసాగించింది. న్యూజిలాండ్ పాకిస్తాన్ లాంటి జట్లే ఏకంగా బాగా రాణించలేక లీగ్ దశ నుంచి నిష్క్రమిస్తే టీమిండియా మాత్రం ప్రత్యర్ధులను వణికిస్తుంది. అయితే ఇటీవల సూపర్ 8 లో జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా విజయం డంక మోగించింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లపై విజయం సాధించి ఇక సెమి ఫైనల్ లో అడుగు పెట్టేసింది టీమిండియా.


 ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో టీమిండియా తలబడబోయే ప్రత్యర్థి  ఎవరు అనే విషయం పైన ప్రస్తుతం చర్చ జరిగింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ అయినా ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ లో టీం ఇండియా తలబడబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ ఎల్లుండి అంటే జూన్ 27వ తేదీన గయానాలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. కాగా 2022 టి20 వరల్డ్ కప్ లో కూడా ఇంగ్లాండ్,టీమిండియా మధ్య సెమి ఫైనల్లో మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 168 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ విధ్వంసం సృష్టించింది. వికెట్లు ఏమీ కోల్పోకుండా ఓపనర్లే ఈ లక్ష్యాన్ని చేదించి.. విజయం సాధించి టీమిండియాను ఇంటికి ఇంటికి పంపించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>