MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru484a6224-2e58-4133-a888-890d50764072-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiru484a6224-2e58-4133-a888-890d50764072-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం తన పుట్టిన రోజు నాడు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఒక మూవీ లోను , సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలోను నటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ కృష్ణ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ప్రాజెక్ట్ మాత్రం ఓకే అయింది. ప్రస్తుతం ఈ సినిమా విశ్వంభర అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా , యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిchiru{#}editor mohan;harish shankar;kalyan krishna;m m keeravani;Makar Sakranti;January;Trisha Krishnan;Chiranjeevi;Music;media;Cinemaచిరు నెక్స్ట్ మూవీపై ఫుల్ కన్ఫ్యూజన్.. ఆ ఇద్దరిలో ఎవరికి ఓకే చెప్పాను..?చిరు నెక్స్ట్ మూవీపై ఫుల్ కన్ఫ్యూజన్.. ఆ ఇద్దరిలో ఎవరికి ఓకే చెప్పాను..?chiru{#}editor mohan;harish shankar;kalyan krishna;m m keeravani;Makar Sakranti;January;Trisha Krishnan;Chiranjeevi;Music;media;CinemaTue, 25 Jun 2024 18:07:00 GMTమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం తన పుట్టిన రోజు నాడు మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఒక మూవీ లోను , సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలోను నటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ కృష్ణ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ప్రాజెక్ట్ మాత్రం ఓకే అయింది. ప్రస్తుతం ఈ సినిమా విశ్వంభర అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా , యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. చిరు నిజానికి విశ్వంబర మూవీ తో పాటు మరో మూవీ కూడా చేయాలి అనుకున్నాడు. కానీ కళ్యాణ్ కృష్ణ తో అనుకున్న సినిమా సెట్ కాకపోవడంతో విశ్వంబర మూవీ ని మాత్రమే సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత ఏదైనా మంచి కథ దొరికితే మరో మూవీ స్టార్ట్ చేద్దాము అనుకున్న ఏ సినిమా సెట్ కాకపోవడంతో విశ్వంబర మూవీ తోనే కంటిన్యూ అవుతున్నాడు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో చిరు , మోహన్ రాజా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు అని మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఓ వార్త వైరల్ అయింది. ఇక తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరు ఓ మూవీ కి గ్రీన్ ఇచ్చినట్లు , ఆ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. చిరు నెక్స్ట్ మూవీ ఈ ఇద్దరు దర్శకులలో ఒకరితో ఉంటుందా లేక వేరే దర్శకుడితో ఉంటుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>