Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith1098337a-38f3-44da-be35-ab95b5dd68ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith1098337a-38f3-44da-be35-ab95b5dd68ae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగించింది. ఇలాగే ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచినప్పటికీ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా టీమిండియా పోరాట పటమను చRohith{#}Winner;INTERNATIONAL;Champion;Fidaa;Rohit Sharma;Australia;Cricket;World Cup;India;Varshamచరిత్ర సృష్టించిన రోహిత్.. వరల్డ్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?చరిత్ర సృష్టించిన రోహిత్.. వరల్డ్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?Rohith{#}Winner;INTERNATIONAL;Champion;Fidaa;Rohit Sharma;Australia;Cricket;World Cup;India;VarshamTue, 25 Jun 2024 11:30:00 GMTప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగించింది. ఇలాగే ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచినప్పటికీ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా టీమిండియా పోరాట పటమను చూసి అసలు విజేత టీమిండియా అని భావించారు.


 అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో ఇలాగే అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రపంచకప్ లో కూడా ఒక్క ఓటమి లేకుండా టీమిండియా దూసుకుపోతుంది అని చెప్పాలి. కీలకమైన సూపర్ 8 దశలో కూడా టీమిండియా వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఎంత కసితీరా కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు రోహిత్. సిక్సర్లు  ఫోర్ లతో చలరేగిపోయాడు అని చెప్పాలి.


 ఇలా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల  వర్షం కురిపించిన రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20 లలో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. మిగతా ఏ ప్లేయర్ కూడా రోహిత్ శర్మకు దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పాలి. 173 సిక్సర్లతో రెండవ స్థానంలో మార్టిన్ గాప్తిల్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో బట్లర్ 137, మాక్స్వెల్ 133, పూరన్ 132 సిక్సర్లతో ఇక టి20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ ఫైవ్ లో ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెమీఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియా అక్కడ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలబడబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>