Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2041e926-3e46-448e-a3c1-14c6becf420e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2041e926-3e46-448e-a3c1-14c6becf420e-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో ఉన్న పోటీ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేటి రోజుల్లో కొత్త ప్రతిభ ఎప్పటికప్పుడు తెరమీదకి వస్తూనే ఉంది. దీంతో ఇక భారత జట్టులో చోటుకోసం ఎంతో పోటీ ఏర్పడింది అని చెప్పాలి. అప్పటికే టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకొని అత్యుత్తమ ఆటగాళ్లుగా తమ సత్తా ఏంటో నిరూపించుకున్న ఆటగాళ్లకు సైతం ఈ పోటీ తట్టుకొని భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నిరూపించుకోలేక ప్రతిభ గల ఎంతో మంది సీనియర్ ప్Cricket {#}Zimbabwe;abhishek;Nitish Kumar;Instagram;Yuva;ICC T20;media;varun sandesh;varun tejజట్టులో నో ఛాన్స్.. KKR ప్లేయర్ అసంతృప్తి?జట్టులో నో ఛాన్స్.. KKR ప్లేయర్ అసంతృప్తి?Cricket {#}Zimbabwe;abhishek;Nitish Kumar;Instagram;Yuva;ICC T20;media;varun sandesh;varun tejTue, 25 Jun 2024 10:40:00 GMTభారత క్రికెట్లో ఉన్న పోటీ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేటి రోజుల్లో కొత్త ప్రతిభ ఎప్పటికప్పుడు తెరమీదకి వస్తూనే ఉంది. దీంతో ఇక భారత జట్టులో చోటుకోసం ఎంతో పోటీ ఏర్పడింది అని చెప్పాలి.  అప్పటికే టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకొని అత్యుత్తమ ఆటగాళ్లుగా తమ సత్తా ఏంటో నిరూపించుకున్న ఆటగాళ్లకు సైతం ఈ పోటీ తట్టుకొని భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నిరూపించుకోలేక ప్రతిభ గల ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో చోటు కోల్పోతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఐపీఎల్ లాంటి టోర్నీలతో ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటి ఇక టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో భారత సెలెక్టర్లు  కూడా ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు టీమిండియాలో అవకాశం ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తున్నారు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న ఐపిఎల్ లో అదరగొట్టిన ఎంతోమంది యువ ఆటగాళ్లకు.. అతి త్వరలోనే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అందరూ అనుకున్నట్లుగానే ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆ జట్టుతో ఆడబోయే టీ20 సిరీస్ కోసం ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ దక్కింది.


 నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ సహా మరి కొంత మంది యంగ్ క్రికెటర్లు ఇలా జింబాబ్వేతో జరగబోయే టి20 సిరీస్ లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడబోతున్నారు. అయితే ఈసారి తప్పకుండా తనకు భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తికి మాత్రం నిరాశ ఎదురయింది. దీంతో అతను తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచాడు. తనకు పెయిడ్ పిఆర్ ఏజెన్సీ ఉంటే బాగుండేది అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో వరుణ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా ఆ జట్టు తరఫున 14 మ్యాచ్లు ఆడే 21 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. అయినప్పటికీ సెలెక్టర్ల నుండి మొండి చేయి ఎదురయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>