MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbb62e9df-c547-44cc-aa84-86b1baddd323-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbb62e9df-c547-44cc-aa84-86b1baddd323-415x250-IndiaHerald.jpgముని, బాణం, కాంచన 3 వంటి హిట్ చిత్రాలతో వేదిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘బాహుబలి’ మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ ‘యక్షిణి’లో టైటిల్ పాత్రలో నటించింది నటి వేదిక. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ మంచి ఆదరణను రాబట్టుకోవడంతో పాటు, ఆమె పాత్రకు మంచి పేరు వస్తుండటంతో.. మరోసారి ఆమె పేరు టాలీవుడ్‌లో బాగా వినబడుతోంది. బాహుబలి మేకర్లైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా అధినేత ప్రసాద్ దేవినేని నిర్మించిన tollywood{#}arjuna;maya;prasad devineni;Kanchana 3;teja;Sri Krishna;krishnudu;Romantic;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Samsung;vedhika;Bahubali;Hindi;media;Juneబాహుబలి మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌లో ‘యక్షిణి’గా నటి వేదిక విశ్వరూపంబాహుబలి మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌లో ‘యక్షిణి’గా నటి వేదిక విశ్వరూపంtollywood{#}arjuna;maya;prasad devineni;Kanchana 3;teja;Sri Krishna;krishnudu;Romantic;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Samsung;vedhika;Bahubali;Hindi;media;JuneTue, 25 Jun 2024 08:18:00 GMTముని, బాణం, కాంచన 3 వంటి హిట్ చిత్రాలతో వేదిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘బాహుబలి’ మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ ‘యక్షిణి’లో టైటిల్ పాత్రలో నటించింది నటి వేదిక. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ మంచి ఆదరణను రాబట్టుకోవడంతో పాటు, ఆమె పాత్రకు మంచి పేరు వస్తుండటంతో.. మరోసారి ఆమె పేరు టాలీవుడ్‌లో బాగా వినబడుతోంది.   బాహుబలి మేకర్లైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా అధినేత

 ప్రసాద్ దేవినేని నిర్మించిన ప్రాజెక్ట్ ‘యక్షిణి’. ఈ వెబ్ సిరీస్‌తో మరోసారి వేదిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. అర్జున ఫల్గుణ, జోహార్, కోటబొమ్మాలి పీఎస్ వంటి చిత్రాలను తీసిన తేజ మర్ని ‘యక్షిణి’ని తెరకెక్కించారు. ఇది వరకు వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రాలకు భిన్నంగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. యక్షిణి టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ యక్షిణి జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ యక్షిణి ఇప్పుడు హాట్

 స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. ఇకపోతే ఈ సిరీస్, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడింది. సిరీస్ కథ ఆధునిక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మరియు థ్రిల్లర్‌గా ఉండేలా రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ లో శ్రీకృష్ణ బాగవణుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పాయింట్ కూడా ఉంటుందట. శాపగ్రస్తురాలైన మాయ అనే యువతి కాపాడటం కోసం కృష్ణుడు చేసే యుద్ధం, ఆమెకు విముక్తి కలిగించే కథతో ఈ సిరీస్ రూపొందిందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, "యక్షిణి" వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుందని... కథలోని మాయాజాలం, కృష్ణుడి కథాంశం, మరియు అధునాతన టెక్నాలజీ మేళవింపుతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>