MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాదు ప్రస్తుతం సాధారణ ప్రాజలు కూడ ‘కల్కి 2898’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసినిమా విడుదల తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ లో విడుదలకాబోతున్న కమలహాసన్ శంకర్ ల ‘భారతీయుడు 2’ గురించి ఎవరు పట్టించు కోవడంలేదు. ‘కల్కి’ మూవీలో ప్రభాస్ తో పాటు కమలహాసన్ కూడ నటిస్తున్న పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లోను కమలహాసన్ కనిపిస్తున్నాడు కానీ తాను హీరోగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ గురించి ఒక్క మాట కూడ చెప్పడం లేదు. దీనితో ‘కల్కి’ బిజీలో పడి కమల్ ‘భారతీయుడు 2’KAMALHASSAN{#}ravi anchor;Sangeetha;shankar;Yevaru;Darsakudu;Joseph Vijay;Director;Event;Prabhas;Cinema;Newsటెన్షన్ పడుతున్న భారతీయుడు 2 !టెన్షన్ పడుతున్న భారతీయుడు 2 !KAMALHASSAN{#}ravi anchor;Sangeetha;shankar;Yevaru;Darsakudu;Joseph Vijay;Director;Event;Prabhas;Cinema;NewsTue, 25 Jun 2024 08:22:00 GMTఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాదు ప్రస్తుతం సాధారణ ప్రాజలు కూడ ‘కల్కి 2898’ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసినిమా విడుదల తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ లో విడుదలకాబోతున్న కమలహాసన్ శంకర్ ల ‘భారతీయుడు 2’ గురించి ఎవరు పట్టించు కోవడంలేదు. ‘కల్కి’ మూవీలో ప్రభాస్ తో పాటు కమలహాసన్ కూడ నటిస్తున్న పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లోను కమలహాసన్ కనిపిస్తున్నాడు కానీ తాను హీరోగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ గురించి ఒక్క మాట కూడ చెప్పడం లేదు.  



దీనితో ‘కల్కి’ బిజీలో పడి కమల్ ‘భారతీయుడు 2’ పక్కకు పెట్టాడా అంటూ కమల్ అభిమానుల కలవర పడుతున్నారు. ఇప్పుడు ఈమూవీకి క్రేజ్ తెప్పించే బాధ్యత ఈమూవీ ట్రైలర్ పై పడింది. ఇప్పటికే దర్శకుడు శంకర్ ఈమూవీ ట్రైలర్ ను కట్ చేసి రెడీపేట్టి ఉంచాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు ఇప్పటివరకు సరైన క్రేజ్ రాకాపోవాడానికి కారణం సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ పెడుతున్నారు.



ఈ కామెంటన్స్ రావడం వెనుక ఒక కారణం కనిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ఈమూవీలోని పాటల ట్యూన్స్ యూత్ కు ఏమాత్రం నచ్చలేదు అన్న ప్రచారం జరుగుతోంది.  దీనికితోడు ఈమధ్య చెన్నైలో ‘భారతీయుడు’ మూవీని రీ రిలీజ్ చేస్తే ఆసినిమాను ఎవరు పట్టించుకోలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాతో పోటీగా విజయ్ నటించిన పాత సినిమా ‘గిల్లీ’ రీ రిలీజ్ చేసిన సందర్భంలో విపరీతంగా చూసిన కాలీవుడ్ యూత్ ‘భారతీయుడు’ మూవీని పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.



తెలుగులో ఆమధ్య ‘భారతీయుడు’ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేసి ‘భారతీయుడు 2’ పై ఆశక్తి పెంచుతారు అన్న వార్తలు వచ్చినప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు. అంచనాలకు అనుగుణంగా ‘కల్కి’ బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఆమ్యానియా కనీసం మూడు వారాలు ఉండే నేపధ్యంలో జనం ‘భారతీయు 2’ గురించి పట్టించుకొక పోవచ్చు ఆన్ అన్న అంచనాలు ఉన్నాయి..    










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>