MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఆగష్టు 15న విడుదలకావలసి ఉన్న ‘పుష్ప 2’ వాయిదా పడటంతో అనేక మీడియం రేంజ్ సినిమాలు పండగ చేసుకుంటూ ఆగష్టు 15న విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆలిస్టులో మొదటిస్థానంలో ఉన్నది దుల్కర్ సల్మాన్ మొట్టమొదటి సారిగా తెలుగులో నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ ఆగష్టు 15న విడుదలకాబోతోంది. అయితే ఇప్పుడు ఈసినిమా అనుకున్న విధంగా ఆగష్టు 15న విడుదలైతే అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలకు కలక్షన్స్ పరంగా బాగా కలిసి వస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ‘లక్కీ భాస్కర్’ కథకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ మూవీకి ఏLUCKY BHASKar{#}dhanush;dulquer salmaan;sekhar;varun tej;Bank;Venky Atluri;August;Cinema;Tollywoodలక్కీ భాస్కర్ తో కుబేర కు సమస్యలు !లక్కీ భాస్కర్ తో కుబేర కు సమస్యలు !LUCKY BHASKar{#}dhanush;dulquer salmaan;sekhar;varun tej;Bank;Venky Atluri;August;Cinema;TollywoodTue, 25 Jun 2024 16:37:00 GMTఆగష్టు 15న విడుదలకావలసి ఉన్న ‘పుష్ప 2’ వాయిదా పడటంతో అనేక మీడియం రేంజ్ సినిమాలు పండగ చేసుకుంటూ ఆగష్టు 15న విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆలిస్టులో మొదటిస్థానంలో ఉన్నది దుల్కర్ సల్మాన్ మొట్టమొదటి సారిగా తెలుగులో నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’  ఆగష్టు 15న విడుదలకాబోతోంది. అయితే ఇప్పుడు ఈసినిమా అనుకున్న విధంగా ఆగష్టు 15న విడుదలైతే అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలకు కలక్షన్స్ పరంగా బాగా కలిసి వస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది.



అయితే ఈ ‘లక్కీ భాస్కర్’ కథకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ మూవీకి ఏదో ఒకవిధమైన లింక్ ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా గాసిప్పులు రావడం వెనుక ఒక ఆశక్తికర కారణం ఉంది. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోయే దుల్కర్ సల్మాన్ కు డబ్బు పై వ్యామోహం పెరిగి కొన్ని అక్రమ మార్గాలలో మిలీనీయర్ గా మారిపోతాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీతో దుల్కర్ టాలీవుడ్ ఎంట్రీ చాల సక్సస్ ఫుల్ గా జరిగే ఆస్కారమ్ ఉంది అంటున్నారు.



శేఖర్ కమ్ముల ధనుష్ ల కాంబినేషన్ లో ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ‘కుబేర’ మూవీ కథ కూడ అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కనీస అవసరాలకు కూడ డబ్బు లేని స్థితిలో ఉన్న ధనుష్ కొన్ని అక్రమ మార్గాలలో చాలతక్కువ సమయంలో వేలకోట్ల ధనవంతుడుగా మారిపోయి ఒక సామ్రాజ్యాన్ని శాసించే స్థితికి ఎదుగుతాడు. ఈరెండు సినిమాల కథలలోనూ హీరోలకు విపరీతమైన డబ్బు వ్యామోహం ఉండటమే కాకుండా అక్రమ మార్గాలలో చాలవేగంగా డబ్బు గణిస్తారు.



ఇంచుమించు ఇదే స్టోరీ లైన్ తో లేటెస్ట్ గా మొదలైన వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ కథ కూడ ఉంటుంది అంటున్నారు. 1980 ప్రాంతాలలో డబ్బు మీద వ్యామోహంతో మట్కా జూదంలో కోట్లు గణించి ఆతరువాత ఆనేర సామ్రాజ్యాన్ని శాసించిన యువకుడి కథ అని తెలుస్తోంది. ఇలా ఒకే కథతో మూడు సినిమాలు రాబోతున్నాయి అనుకోవాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>