MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd36255959-c257-4ce7-b9d5-dc7b9f38f77f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd36255959-c257-4ce7-b9d5-dc7b9f38f77f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ నటుడు తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా , గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటvd{#}gopi sundar;vijay deverakonda;Jio;Sri Venkateshwara Creations;king;producer;Producer;Kannada;Amazon;parasuram;Posters;Yuva;June;Box office;Music;Beautiful;Tollywood;Tamil;Hindi;Telugu;Cinema"ఫ్యామిలీ స్టార్" హిందీ "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఫ్యామిలీ స్టార్" హిందీ "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!vd{#}gopi sundar;vijay deverakonda;Jio;Sri Venkateshwara Creations;king;producer;Producer;Kannada;Amazon;parasuram;Posters;Yuva;June;Box office;Music;Beautiful;Tollywood;Tamil;Hindi;Telugu;CinemaTue, 25 Jun 2024 20:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ నటుడు తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా , గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఓ టి టి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మూవీ హిందీ భాషలో మాత్రం ఓ టీ టీ లో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ ఓ టి టి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను జియో సినిమా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 28 వ తేదీ నుండి హిందీ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>