PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-polavaram-is-to-be-completed-this-is-the-only-best-option-this-is-the-only-brahmastra-in-chandrababu-handsaa028cb6-afa7-4b80-8aae-24ca688bd9a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-polavaram-is-to-be-completed-this-is-the-only-best-option-this-is-the-only-brahmastra-in-chandrababu-handsaa028cb6-afa7-4b80-8aae-24ca688bd9a3-415x250-IndiaHerald.jpg- పార్ల‌మెంటు స్పెష‌ల్ బిల్లుతో కేంద్రానికి వ‌దిలేయ‌డ‌మే బెట‌ర్‌ - కూట‌మి ఎంపీల‌తో పార్ల‌మెంటులో బిల్లు పాస్ చేయాల్సిందే - కేంద్రం చేతుల్లో పెట్టేస్తేనే బాబుకు నో రిస్క్‌ ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై సీఎం చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. తొలి ప‌ర్య‌ట‌న కూడా.. ఈ ప్రాజెక్టు వ‌ద్దే చేప‌ట్టారు. ఆసాంతం ప‌రిశీలించారు. ఏ ప‌నులు ఎప్ప‌టికి పూర్తి అవుతాయో.. ఏయే ప‌నులకు ఎంత నిధులు కావాలో కూడా ఆయ‌న తెలుసుకున్నారు. సో.. ఇప్ప‌టికిప్పుడు అయ్యే ప‌నులు లేవ‌ని AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; Polavaram{#}electricity;Aqua;Polavaram Project;TDP;India;CMపోల‌వ‌రం పూర్త‌వ్వాలంటే ఈ ఒక్క‌టే బెస్ట్ ఆప్ష‌న్‌... చంద్ర‌బాబు చేతిలో ఈ ఒక్క‌టే బ్ర‌హ్మాస్త్రం..!పోల‌వ‌రం పూర్త‌వ్వాలంటే ఈ ఒక్క‌టే బెస్ట్ ఆప్ష‌న్‌... చంద్ర‌బాబు చేతిలో ఈ ఒక్క‌టే బ్ర‌హ్మాస్త్రం..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; Polavaram{#}electricity;Aqua;Polavaram Project;TDP;India;CMMon, 24 Jun 2024 10:18:24 GMT- పార్ల‌మెంటు స్పెష‌ల్ బిల్లుతో కేంద్రానికి వ‌దిలేయ‌డ‌మే  బెట‌ర్‌
- కూట‌మి ఎంపీల‌తో పార్ల‌మెంటులో బిల్లు పాస్ చేయాల్సిందే
- కేంద్రం చేతుల్లో పెట్టేస్తేనే బాబుకు నో రిస్క్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై సీఎం చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. తొలి ప‌ర్య‌ట‌న కూడా.. ఈ ప్రాజెక్టు వ‌ద్దే చేప‌ట్టారు. ఆసాంతం ప‌రిశీలించారు. ఏ ప‌నులు ఎప్ప‌టికి పూర్తి  అవుతాయో.. ఏయే ప‌నులకు ఎంత నిధులు కావాలో కూడా ఆయ‌న తెలుసుకున్నారు. సో.. ఇప్ప‌టికిప్పుడు అయ్యే ప‌నులు లేవ‌ని కూడా ఆయ‌న చెప్పారు. పైగా.. ఒక్కొక్క ప‌నుల‌కు నాలుగేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్రాజెక్టు పూర్తి కావడానికి ఐదు నుంచి ఎనిమిదేళ్లు ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు.


ఇలాంటి స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా పార్ల‌మెంటులో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌ప్పుడు మేం క‌ట్టుకుంటామ‌ని తీసుకున్న ప్రాజెక్టును ఎలానూ పూర్తి చేయ‌ని నేప‌థ్యంలో ఇప్పుడు పార్ల‌మెంటులో ప్ర‌త్యేక బిల్లును ప్ర‌వేశ పెట్టి.. పోల‌వ‌రం ప్రాజెక్టు బాధ్య‌త‌ల‌ను కేంద్రానికి వ‌దిలేయ‌డ‌మే బెట‌ర్ అని నీటి పారుద‌ల నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం క‌ట్టినా.. కేంద్రం క‌ట్టినా.. కేంద్రం వాటా కింద విద్యుత్ ఇవ్వాలి. అదేవిధంగా ప‌న్నులు క‌ట్టాలి.


కాబ‌ట్టి చంద్ర‌బాబు రిస్క్ భ‌రించే బ‌దులు కేంద్రానికి వ‌దిలేస్తే.. రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధుల‌ను ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. కొంత వ‌ర‌కు భారం త‌ప్పుతుంది. పేరు సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ముందుగా.. ప‌నులు పూర్త‌వుతాయి. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీల ద్వారా.. ఆయ‌న బిల్లును పాస్ చేయించుకో వాలి. అదే స‌మ‌యంలో ఆయ‌న స్వ‌యంగా కేంద్రంపై కొంత మేర‌కు ఒత్తిడి తీసుకువ‌స్తే.. ఈ ప‌ని సులువుగా నెర‌వేరుతుంది.


అలా కాకుండా.. మొత్తం నేనే క‌ట్టిస్తాను.. అంటే.. మ‌రో ఐదేళ్లు గిర్రున తిరిగిపోతాయి... త‌ప్ప ప్రాజెక్టు అయితే.. పూర్త‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో పార్ల‌మెంటును సాధ్య‌మైనం త వ‌ర‌కు వాడుకుంటే అది చంద్ర‌బాబుకు మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రాజెక్టు పూర్తి చేయ‌డ‌మే ల‌క్ష్యం అయితే.. కేంద్రం అయితే బెట‌ర్ అంటున్నారు నిపుణులు. లేక‌పోతే నిధుల కోసం.. ప్ర‌తిసారీ కేంద్రాన్ని బ్ర‌తిమిలాడుకోవాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>