PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/janasenathone-yepiki-nyayam-jaruguthunda87572bad-2695-45b8-baf9-049aa6ba865b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/janasenathone-yepiki-nyayam-jaruguthunda87572bad-2695-45b8-baf9-049aa6ba865b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ మంచి ఊపులో కనిపిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకున్న జనసేన పార్టీ.. అసలు వెనుకడుగు వేయడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలతో బలంగా తయారైంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... ఇవాల్టి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలలో... జనసేన పాత్ర చాలా కీలకమైనది. janasena{#}uday kiran;Telugu Desam Party;MP;Parliment;kakinada;kalyan;Janasena;polavaram;Prime Minister;Polavaram Project;Parliament;Assembly;central government;Party;Andhra Pradesh;Governmentపార్లమెంట్‌: జనసేనతోనే ఏపీకి 100 శాతం స్ట్రైక్ రేట్ ?పార్లమెంట్‌: జనసేనతోనే ఏపీకి 100 శాతం స్ట్రైక్ రేట్ ?janasena{#}uday kiran;Telugu Desam Party;MP;Parliment;kakinada;kalyan;Janasena;polavaram;Prime Minister;Polavaram Project;Parliament;Assembly;central government;Party;Andhra Pradesh;GovernmentMon, 24 Jun 2024 08:11:44 GMT* జనసేన ఎంపీలు ఇద్దరే
* 100 శాతం ఏపీ కోసం పోరాటం
* తెలుగోడి సత్తా చాటాలి
* మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకోవడం



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ మంచి ఊపులో కనిపిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకున్న జనసేన పార్టీ.. అసలు వెనుకడుగు వేయడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలతో బలంగా తయారైంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... ఇవాల్టి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలలో... జనసేన పాత్ర చాలా కీలకమైనది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం...  ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాన్నిహిత్యం ఉండటం జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో... జనసేన పార్టీ ఏది డిమాండ్ చేసినా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి... ఈ పార్లమెంటు సమావేశాలలో... 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ పనిచేయాలి. ఏపీకి రావాల్సిన నిధులను... పార్లమెంట్ వేదికగా  అడగాలి.


జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. అందులో సీనియర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కాగా... కాకినాడ ఎంపీగా ఉదయ్ గెలిచారు. వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ నేతలతో ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ గళాన్ని... గట్టిగా వినిపించాలి. విభజన హామీలను నెరవేర్చే దిశగా.... జనసేన ఎంపీలు ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయాల్లోకి వస్తే... పార్లమెంట్ కూడా వానకాల్సిందే అనే రేంజ్ లో...  రెచ్చిపోవాలి.

తమ మిత్రపక్షం కేంద్రంలో అధికారంలో ఉందని.... పొగరు తెచ్చుకోకుండా... ఏపీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. పోలవరం కు రావలసిన నిధులను రాబట్టాలి. రాజధానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని నిలదీయాలి. అలాగే ఏపీలో ఉన్న పోర్టుల  డెవలప్మెంట్ కు నిధులు అడగాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగే రోడ్ల మరమ్మత్తులు జరిగేలా ప్రశ్నించాలి. నీళ్ల విషయంలో తెలంగాణకు, ఏపీకి మధ్య పంపకాలు సజావుగా ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరాలి. మొదటిసారి పార్లమెంటులో  జనసేన ఎంపీలు అడుగుపెడుతున్న నేపథ్యంలో... చరిత్రలో నిలిచిపోయేలా.. ఏపీ కోసం 100% పోరాటం చేయాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>