Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral4956c6ab-c230-4e4c-bf45-e9348c04c5e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral4956c6ab-c230-4e4c-bf45-e9348c04c5e3-415x250-IndiaHerald.jpgమనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే ఉంటుంది అని చెబుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది మాత్రం అబ్బే అలాంటివేమీ ఉండవు కేవలం అది అపోహ మాత్రమే అని అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పునర్జన్మను ఎంతో గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అయితే ఇక మనిషి చనిపోయిన తర్వాత మళ్లీ పుట్టడం నిజమే అని అనిపించే విధంగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు మారుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. పునర్జన్మ కథకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందViral{#}jeevitha rajaseskhar;Girl;Earhquake;Gujarat - Gandhinagar;Parents;School;Manamనిజంగానే పునర్జన్మ ఉందా.. ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు?నిజంగానే పునర్జన్మ ఉందా.. ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు?Viral{#}jeevitha rajaseskhar;Girl;Earhquake;Gujarat - Gandhinagar;Parents;School;ManamMon, 24 Jun 2024 16:45:00 GMTమనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే ఉంటుంది అని చెబుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది మాత్రం అబ్బే అలాంటివేమీ ఉండవు  కేవలం అది అపోహ మాత్రమే అని అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పునర్జన్మను ఎంతో గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అయితే ఇక మనిషి చనిపోయిన తర్వాత మళ్లీ పుట్టడం నిజమే అని అనిపించే విధంగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఎన్నో ఘటనలు మారుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. పునర్జన్మ కథకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఆ బాలిక వయస్సు ఐదేళ్లు మాత్రమే. అయితే తనది పునర్జన్మ అంటూ ఆ బాలిక చెబుతున్న మాటలు తల్లిదండ్రులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు తల్లిదండ్రులు కూడా నిజంగానే బాలికది పునర్జన్మ అంటూ నమ్మేయడానికి ఎన్నో కారణాలు కూడా కారణం అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఆ అమ్మాయి ఇప్పటివరకు పాఠశాలకు వెళ్లలేదు. పుట్టినప్పటినుంచి గుజరాతి మాట్లాడే వారితో నివసించింది. కానీ ఆమె కొన్ని కొన్ని సార్లు హిందీలో అనర్గళంగా మాట్లాడటం ప్రారంభించింది. అంతే కాదు గత జీవిత కథను హిందీలో చెప్పడం ప్రారంభించింది. ఘటన గుజరాత్ లోని బనస్కాంత ప్రాంతంలో వెలుగు చూసింది.



 ఐదేళ్ల చిన్నారి దక్ష.. ఇది తనకు పునర్జన్మ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె హిందీలో అనర్గలంగా మాట్లాడటం చూసి కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. 23 ఏళ్ల క్రితం తాను కాచ్ జిల్లాలోని అన్జర్ ప్రాంతంలో నివసించినట్లు చెబుతుంది సదరు బాలిక. గత జన్మలో తనతో పాటు తన కుటుంబం 2001లో భూకంపం లో మరణించారు అంటూ తెలిపింది. అయితే ఆ బాలిక చెప్పిన వాదనలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కాగా మునుపటి జన్మలో తన పేరు ఫ్రాంగ్రీన్ అని తెలిపింది. ఇక తాను మరణించిన రోజున స్కూల్ నుంచి తిరిగి వస్తున్నానని.. భవనం పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే సదరు బాలిక మాటలు విని అందరు ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>