PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawans-aggression-is-likely-to-trouble-chandrababu213cf868-a0a5-42e4-a1c8-e1a99a1c4d46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawans-aggression-is-likely-to-trouble-chandrababu213cf868-a0a5-42e4-a1c8-e1a99a1c4d46-415x250-IndiaHerald.jpgకేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవడంలో టీడీపీ ఎంపీల పాత్ర ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు చేతికి చక్రం వచ్చిందని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసిన 21 మంది ఎంపీలు ఏపీలో విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి కోసం బాబు పట్టుపడితే మోదీ మెట్టు దిగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. chandrababu {#}Chakram;Narendra Modi;News;TDP;Bharatiya Janata Party;Parliment;MP;kalyan;Janasena;CBN;Andhra Pradeshబాబు పట్టుపడితే మోదీ మెట్టు దిగాల్సిందే.. ఏపీని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తారా?బాబు పట్టుపడితే మోదీ మెట్టు దిగాల్సిందే.. ఏపీని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తారా?chandrababu {#}Chakram;Narendra Modi;News;TDP;Bharatiya Janata Party;Parliment;MP;kalyan;Janasena;CBN;Andhra PradeshMon, 24 Jun 2024 11:45:00 GMTకేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవడంలో టీడీపీ ఎంపీల పాత్ర ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు చేతికి చక్రం వచ్చిందని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసిన 21 మంది ఎంపీలు ఏపీలో విజయం సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి కోసం బాబు పట్టుపడితే మోదీ మెట్టు దిగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. కేందం టీడీపీ ఎంపీలకు ఇప్పటికే సముచిత స్థానం ఉన్న పదవులను కేటాయించింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడం చంద్రబాబు ముందు ఉన్న పెద్ద టాస్క్ అనే సంగతి తెలిసిందే. ఏపీ ఎంపీలు రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తే కేంద్రం సైతం ఏపీపై కరుణ చూపే అవకాశం ఉంది.
 
భవిష్యత్తులో కూటమికి మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగానే మోదీ సర్కార్ అడుగులు వేయనుందని సమాచారం అందుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కళ్యాణ్ సైతం చెబుతుండటం గమనార్హం. కూటమి వేగంగా ఇచ్చిన నిర్ణయాలను అమలు చేస్తే మాత్రమే ప్రజల్లో కూటమిపై పాజిటివ్ ఒపీనియన్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
కేంద్రం నుంచి ఏపీకి రాబట్టాల్సిన నిధుల, ఏపీ అప్పులకు సంబంధించి వెసులుబాటు పొందాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. ఏపీ ఎంపీలు తమ మాటల ద్వారా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తే కచ్చితంగా రాష్ట్రానికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అక్కర్లేదు. టీడీపీ, జనసేన ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం లక్ష్యాలను ఎంచుకుని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తూ ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీ వేగంగా అభివృద్ధి చెందడం సాధ్యమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>