Businesspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/kotiteddy-saripallycb8ed778-f6fd-41f8-b992-99c0e0a632f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/kotiteddy-saripallycb8ed778-f6fd-41f8-b992-99c0e0a632f2-415x250-IndiaHerald.jpgఒక సచిన్ టెండూల్కర్.. ఒక బిల్ గేట్స్.. ఒక రజనీకాంత్.. వీళ్ళందరూ ఏం నిరూపించారు. మనిషి చదువుకి జ్ఞానానికి అసలు సంబంధం లేదు అని నిరూపించారు. ఎందుకంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన బిల్ గేట్స్ ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగితే.. అటు టెన్త్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా మారారు. కేవలం బస్ టికెట్ కండక్టర్గా పనిచేసిన రజినీకాంత్ ఇక ఇప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా చదువుకు జ్ఞానానికి సంబంధం లేదు అని నిKotiteddy saripally{#}Sachin Tendulkar;Businessman;billGates;Rajani kanth;Manam;job;Microsoft;Amarnath Cave Temple;krishna district;Koti Reddy Saripalli;Indiaకామన్ మ్యాన్ TO బిసినెస్ మ్యాన్.. కోటిరెడ్డి ఇది పేరు కాదు బ్రాండ్?కామన్ మ్యాన్ TO బిసినెస్ మ్యాన్.. కోటిరెడ్డి ఇది పేరు కాదు బ్రాండ్?Kotiteddy saripally{#}Sachin Tendulkar;Businessman;billGates;Rajani kanth;Manam;job;Microsoft;Amarnath Cave Temple;krishna district;Koti Reddy Saripalli;IndiaMon, 24 Jun 2024 10:58:00 GMTఒక సచిన్ టెండూల్కర్.. ఒక బిల్ గేట్స్.. ఒక రజనీకాంత్.. వీళ్ళందరూ ఏం నిరూపించారు. మనిషి చదువుకి జ్ఞానానికి అసలు సంబంధం లేదు అని నిరూపించారు. ఎందుకంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన బిల్ గేట్స్ ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగితే.. అటు టెన్త్ ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా మారారు. కేవలం బస్ టికెట్ కండక్టర్గా పనిచేసిన రజినీకాంత్ ఇక ఇప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.


 ఇలా చదువుకు జ్ఞానానికి సంబంధం లేదు అని నిరూపించిన మహానుభావులు ఎంతోమంది. ఇలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సరిపల్లి కోటిరెడ్డి కూడా ఒకరు. ఏదో చేయాలనే దృఢమైన సంకల్పం, రాబోయే తరాలను మార్చాలని పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న చేరుకోవాలనే మొండితనం.. ఆయనను గెలుపు వైపు నడిపించాయ్. దీంతో పదవ తరగతి పాసైన ఆయన ఏకంగా ఇప్పుడు ఒక గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ స్థాయికి ఎదిగారు. చదువుకి జ్ఞానానికి సంబంధమే లేదు అని నిరూపించారు. ఆయనే కృష్ణా జిల్లా వాసి కోటిరెడ్డి సరిపల్లి.


 కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగిన కోటిరెడ్డి చదువుకుంది పదో తరగతి వరకే. కానీ ఆయన సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కెరియర్ ప్రారంభించి అంచలంచలుగా ఎదుగుతూ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో అత్యున్నత ఉద్యోగం సాధించేవరకు ఆయన ప్రయాణం సాగింది. అక్కడితో ఆయన ఊరుకోలేదు. ఇంకా ఏదో చేయాలని ఆలోచన ఆయన మనసులో మెదులుతూనే ఉంది.


అమ్మ మాటే వేదంగా ముందుకు సాగిన కోటిరెడ్డి.. మళ్లీ ఇండియాకు వచ్చి కోటిరెడ్డి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ తో స్థాపించారు.  తన సంస్థ కార్యకలాపాలను 230 పై చిలుకు దేశాల్లో విస్తరించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరోవైపు సాఫ్ట్వేర్ రంగంలో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించారు. ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన కామన్ మ్యాన్ నుంచి గ్రేట్ బిజినెస్ మాన్ గా మారిపోయారు. ఇప్పుడు కోటిరెడ్డి సరిపల్లి అంటే కేవలం పేరు మాత్రమే కాదు అదొక బ్రాండ్ అన్నట్లుగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>