PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-raghunandanrao-harishrao-brs-kcr-ktr717a84d7-5a56-438d-8b25-5c703bac7ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-raghunandanrao-harishrao-brs-kcr-ktr717a84d7-5a56-438d-8b25-5c703bac7ff0-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాజకీయాలన్ని మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ఏకదాటిగా పాలన చేసింది. కేసీఆర్ చెప్పిందే వేదం అయింది. ఇక ఆయన కింద హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే కీలక నేతలుగా ఎదిగారు. అలాంటి బీఆర్ఎస్ ను 2023 ఎన్నికల్లో ప్రజలు తీసి నేలకు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులంతా బీఆర్ఎస్ లో ఉండలేక ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారట. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి.bjp;raghunandanrao;harishrao;brs;kcr;ktr{#}KTR;kavitha;Jammu and Kashmir - Srinagar/Jammu;Medak;Raghunandan Rao;Arrest;Election;Yevaru;KCR;Revanth Reddy;Assembly;Party;Congress;MP;Telangana;Newsబిజెపిలో హరీష్ రావు..ఆ ఎంపీ ఏమంటున్నారంటే..?బిజెపిలో హరీష్ రావు..ఆ ఎంపీ ఏమంటున్నారంటే..?bjp;raghunandanrao;harishrao;brs;kcr;ktr{#}KTR;kavitha;Jammu and Kashmir - Srinagar/Jammu;Medak;Raghunandan Rao;Arrest;Election;Yevaru;KCR;Revanth Reddy;Assembly;Party;Congress;MP;Telangana;NewsMon, 24 Jun 2024 10:54:57 GMT తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల్లో రాజకీయాలన్ని మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ఏకదాటిగా పాలన చేసింది. కేసీఆర్ చెప్పిందే వేదం అయింది. ఇక ఆయన కింద హరీష్ రావు, కేటీఆర్  మాత్రమే కీలక నేతలుగా ఎదిగారు. అలాంటి బీఆర్ఎస్ ను 2023 ఎన్నికల్లో  ప్రజలు తీసి నేలకు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులంతా  బీఆర్ఎస్ లో ఉండలేక ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక  సతమతమవుతున్నారట. అసెంబ్లీ  ఎలక్షన్స్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. 

కనీసం ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా సాధించలేదు. దీంతో బిఆర్ఎస్ కు ఎలాంటి పట్టు లేకుండా పోయింది. అప్పటికే కవిత అరెస్టు అయింది. అలాగే కేసీఆర్ మరియు కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే  కేసీఆర్ నమ్మిన బంటు అయినటువంటి పోచారం  ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం  మేము గేట్లు తెలిస్తే బిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని అంటున్నారు. అలాంటి ఆరోపణలు వస్తున్న తరుణంలో హరీష్ రావు కూడా  పార్టీ మారుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఆయన వెళ్తే మాత్రం బిజెపిలోకి వెళ్తారని అంటున్నారు. అయితే హరీష్ రావు బిజెపిలోకి  రావడానికి మెదక్ బిజెపి ఎంపీ  రఘునందన్ రావు  చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తానంటే మా పార్టీ సాధరంగా ఆహ్వానిస్తుందని,  కేవలం హరీష్ రావే కాకుండా కేసీఆర్ బీఆర్ఎస్ లో ఉండే ఏ వ్యక్తి అయినా సరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు వచ్చినా, పార్టీ ఆహ్వానిస్తుందని తెలియజేశారు. ఈ విధంగా రఘునందన్ రావు మాటలు చూస్తే మాత్రం  హరీష్ రావు బిజెపిలో చేరుతారు అని కొంతమంది ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>