Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4e1dc4ab-e66f-4472-be1d-7b0fc0be95e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4e1dc4ab-e66f-4472-be1d-7b0fc0be95e7-415x250-IndiaHerald.jpgఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి లేడి సూపర్ స్టార్, లేడి అమితాబ్ అనిపించుకుంది విజయశాంతి. విజయశాంతి పోలీసాఫీసర్ రోల్ చేస్తే సినిమా అదిరిపోవాల్సిందే. ఎంతోమంది మహిళలకు విజయశాంతి ప్రేరణగా నిలిచింది. సినిమాల్లో విజయశాంతి యాక్షన్ అదరగొట్టేసింది. కానీ రాజకీయాలతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకొని దూసుకెళ్లాలని ట్రై చsocialstars lifestyle{#}ashok;pradeep;Kartavyam;Vijayashanti;kalyan ram;sunil;Music;srikanth;mahesh babu;vyjayanthi;Amitabh Bachchan;Chitram;Traffic police;Cinema;NTRపవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా "రాములమ్మ" ఈజ్ బ్యాక్..!పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా "రాములమ్మ" ఈజ్ బ్యాక్..!socialstars lifestyle{#}ashok;pradeep;Kartavyam;Vijayashanti;kalyan ram;sunil;Music;srikanth;mahesh babu;vyjayanthi;Amitabh Bachchan;Chitram;Traffic police;Cinema;NTRMon, 24 Jun 2024 23:00:00 GMTఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి లేడి సూపర్ స్టార్, లేడి అమితాబ్ అనిపించుకుంది విజయశాంతి. విజయశాంతి పోలీసాఫీసర్ రోల్ చేస్తే సినిమా అదిరిపోవాల్సిందే. ఎంతోమంది మహిళలకు విజయశాంతి ప్రేరణగా నిలిచింది. సినిమాల్లో విజయశాంతి యాక్షన్ అదరగొట్టేసింది. కానీ రాజకీయాలతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకొని దూసుకెళ్లాలని ట్రై చేస్తుంది. బింబిసార, డెవిల్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల తర్వాత కళ్యాణ్ రామ్ మరో చిత్రం చేస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతోంది. తన తాత గారు స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్ యానవర్సరీ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్ర ప్రకటన చేశారు. ఆల్రెడీ ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

ఈ మూవీలో సర్ప్రైజ్ ఏంటంటే.. కళ్యాణ్ రామ్ 21వ సినిమా ను విజయ శాంతి ఒప్పుకుంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. నేడు విజయశాంతి పుట్టిన రోజు కావడంతో కళ్యాణ్ రామ్ సినిమా నుంచి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్ చేశారు.పోలీస్ అధికారి పాత్రలకు విజయశాంతి పెట్టింది పేరు. కర్తవ్యం లాంటి చిత్రాల్లో విజయశాంతి చెలరేగిపోయింది. తనకి బాగా అచొచ్చిన పోలీస్ అధికారిగానే ఈ చిత్రంలో కనిపించింది. వైజయంతి ఐపీఎస్ పాత్రలో విజయశాంతి నటిస్తోంది. పోలీస్ డ్రెస్ విజయశాంతి యమా స్టైలిష్ గా ఉన్నారు.క్రిమినల్స్ తో ఆమె ఫైట్ చేస్తున్న విధానం చూస్తుంటే వింటేజ్ విజయశాంతి ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది. వాయిస్ ఓవర్ లో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. 'వైజయంతి ఐపీఎస్.. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యూనిఫామ్ కి పౌరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం.. నేనే తన సైన్యం' అంటూ కళ్యాణ్ రామ్ చెబుతున్న డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.సయీ మంజ్రేకర్ హీరోయిన్. శ్రీకాంత్ కీలక పాత్రలోఈ చిత్రంలో నటిస్తున్నారు. అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>