PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-a-shame-for-ycp-mps-in-parliament7d9adeaa-ca48-4f5d-b2c6-5f2d5924e023-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-it-a-shame-for-ycp-mps-in-parliament7d9adeaa-ca48-4f5d-b2c6-5f2d5924e023-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీలో 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌.. వైసీపీ బితుకు బితుకు మ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు ఎక్క‌డ సీట్లు కేటాయిస్తారో.. ఎక్క‌డ కూర్చోవాల్సి వ‌స్తుందో అనే బెంగ పార్టీని వెంటాడుతోంది. అస‌లు స‌భ‌ను బాయ్ కాట్ చేయాల‌ని నిర్ణ‌యించుకునే ప‌రిస్థితి వ‌చ్చారు. దీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి. ఇదిలావుంటే.. పార్ల‌మెంటులోనూ.. ముఖ్యంగా లోక్‌స‌భ‌లో ఎలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. వైసీపీకి మిగిలింది.. నాలుగు ఎంపీ స్థానాలే., పార్ల‌మెAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; jagan; ysrcp{#}YCP;Party;Congress;MP;Indiaవైసీపీ ఎంపీలకు పార్ల‌మెంటులో అవ‌మాన‌మేనా..!వైసీపీ ఎంపీలకు పార్ల‌మెంటులో అవ‌మాన‌మేనా..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ys jagan; jagan; ysrcp{#}YCP;Party;Congress;MP;IndiaMon, 24 Jun 2024 11:06:00 GMTఏపీ అసెంబ్లీలో 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌.. వైసీపీ బితుకు బితుకు మ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు ఎక్క‌డ సీట్లు కేటాయిస్తారో.. ఎక్క‌డ కూర్చోవాల్సి వ‌స్తుందో అనే బెంగ పార్టీని వెంటాడుతోంది. అస‌లు స‌భ‌ను బాయ్ కాట్ చేయాల‌ని నిర్ణ‌యించుకునే ప‌రిస్థితి వ‌చ్చారు. దీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చూడాలి. ఇదిలావుంటే.. పార్ల‌మెంటులోనూ.. ముఖ్యంగా లోక్‌స‌భ‌లో ఎలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.


ఎందుకంటే.. వైసీపీకి మిగిలింది.. నాలుగు ఎంపీ స్థానాలే., పార్ల‌మెంటులో చూసుకుంటే.. 543 మందిలో వీరు న‌లుగురు. ముందుగా అధికార ప‌క్షానికి మ‌ద్ద‌తు ఇస్తున్న 293 మందికి సీట్లు కేటాయిస్తారు. త‌ర్వాత‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా  ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి సీట్లు ఇస్తారు. వీరితోనే పార్ల‌మెంటు నిండిపోతుంది. ఇక‌, అటు ఇటు కాకుండా.. ఉన్న కొన్ని పార్టీల‌కు సీట్లు చివ‌ర‌లో కేటాయిస్తారు. ఇప్పుడు వాటిలోనే వైసీపీకి సీట్లు ద‌క్కుతాయి.


వాటిలో కూడా.. పార్టీల బ‌లా బ‌లాల‌ను బ‌ట్టే సీట్లు కేటాయిస్తారు. ఉదాహ‌ర‌ణ కు బీజేడీ (ఒడిసా) కి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. కాబ‌ట్టి.. దీనికి ముందు ప్రాధాన్యం ద‌క్కుతుంది. త‌ర్వాత‌.. ఐదు సీట్లు ద‌క్కించుకున్న మ‌రో ఉత్త‌రాది పార్టీ ఉంది. దీనికి త‌ర్వాత స్థానం ఉంటుంది. ఆ త‌ర్వాత‌.. న‌లుగురు ఉన్న వైసీపీకి ప్రాధాన్యం ఇస్తారు. అంటే.. ఈ సీట్లు దాదాపు పార్ల‌మెంటులో చివ‌రి వ‌రుస‌లో కేటాయించే ప‌రిస్థితి ఉంటుంద‌ని పార్ల‌మెంటు వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


ఇదే స‌మ‌యంలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలోనూ.. ఇత‌ర చ‌ర్చ‌ల్లోనూ వైసీపీకి ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశం చాలా వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంది. న‌లుగురు ఎంపీ లే ఉన్నందున‌.. చివ‌రి ప్రాధాన్యంగా వీరికి స్పీక‌ర్ అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో గ‌తంలో ఉన్న ఇంపార్టెన్సు.. ప్రాధాన్యం వంటివి ఇప్పుడు వైసీపీకి క‌నుచూపుమేర‌లో ద‌క్క‌క‌పోవ‌చ్చు. పైగా.. బ‌ల‌మైన నాయ‌కులు కూడా.. లేక పోవ‌డంతో వైసీపీ పార్ల‌మెంటులో త‌న గ‌ళం వినిపించ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>