Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithd564df15-305f-4941-a075-eb1ec80c48b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithd564df15-305f-4941-a075-eb1ec80c48b8-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ కి మాత్రం ఎంతో దూరం అయింది. ఈ క్రమంలోనే ప్రతిసారి ప్రపంచకప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేయడం.. చివరికి టైటిల్ చేజార్చుకుని అభిమానులను నిరాశపరచడం చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అద్భుతంగా రాణించాలని పట్టుదలతో బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస విజయాలు సRohith{#}Rohit Sharma;Hardik Pandya;Kuldeep Yadav;American Samoa;Pakistan;Bangladesh;Australia;World Cup;Indiaఆ ఒక్కటి చేస్తే చాలు.. ఈజీగా గెలిచేయొచ్చు : రోహిత్ఆ ఒక్కటి చేస్తే చాలు.. ఈజీగా గెలిచేయొచ్చు : రోహిత్Rohith{#}Rohit Sharma;Hardik Pandya;Kuldeep Yadav;American Samoa;Pakistan;Bangladesh;Australia;World Cup;IndiaMon, 24 Jun 2024 12:00:00 GMTవరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంత కాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ కి మాత్రం ఎంతో దూరం అయింది. ఈ క్రమం లోనే ప్రతిసారి ప్రపంచకప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేయడం.. చివరికి టైటిల్ చేజార్చుకుని  అభిమానులను నిరాశ పరచడం చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అద్భుతం గా రాణించాలని పట్టుదలతో బరిలోకి దిగింది.


 అనుకున్నట్లుగానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే వరుస విజయాలు సాధిస్తూ ఓటమి లేని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ లాంటి పటిష్టమైన జట్లు కూడా అమెరికా లోని స్లో పిచ్ లపై తడబడి చివరికి లీగ్ దశతోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అటు భారత జట్టు మాత్రం ఇప్పటి  వరకు ఒక్క ఓటమి లేకుండా సెమి ఫైనల్లోఅడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సూపర్ 8 లో భాగం గా అటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది భారత జట్టు.


 ఇక నేడు ఆస్ట్రేలియా తో తలబడేందుకు సిద్ధమవుతుంది. అయితే బంగ్లాదేశ్ తో మ్యాచ్లో 8 మంది బ్యాటర్లతో బరి లోకి దిగడం తమకు ఎంతగానో కలిసి వచ్చింది అంటూ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. టి20 ఫార్మాట్ లో ఎక్కువగా 50లు సెంచరీలు చేయాల్సిన అవసరం లేదనుకుంటా.. ప్రత్యర్థి బౌలర్ల పై ఒత్తిడి చేస్తే పరుగులు ఆటోమేటిక్గా వస్తాయి. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో మెరిస్తే.. ప్రత్యర్థు లపై మాదే ఫైచేయి. ఇక బౌలింగ్లో కూడా అతను ఎంతో కీలకమే. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>