Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetelabf31b5fc-290c-4c49-9573-0e0478eade42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetelabf31b5fc-290c-4c49-9573-0e0478eade42-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. చివరికి అంతకంతకు పార్టీని బలపరుచుకుంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతల సత్తా చాటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటితో పోల్చి చూస్తే ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దిటుగా సీట్లు గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. కEetela{#}raja;Eatala Rajendar;G Kishan Reddy;war;Fighter;Success;Minister;Bharatiya Janata Party;Telangana;Party;Assembly;Congress;Parlimentఅదేంటి.. రాజాసింగ్ ను ఈటెల అంత మాట అనేసాడు?అదేంటి.. రాజాసింగ్ ను ఈటెల అంత మాట అనేసాడు?Eetela{#}raja;Eatala Rajendar;G Kishan Reddy;war;Fighter;Success;Minister;Bharatiya Janata Party;Telangana;Party;Assembly;Congress;ParlimentMon, 24 Jun 2024 11:40:00 GMTఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది బిజెపి. చివరికి అంతకంతకు పార్టీని బలపరుచుకుంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతల సత్తా చాటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటితో పోల్చి చూస్తే ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దిటుగా సీట్లు గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. కనీసం అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడంలో సక్సెస్ అయింది.


 ఈ క్రమంలోనే ఇలా తెలంగాణ నుంచి  ఎంపీలుగా ఎన్నికైన బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి కీలకమైన నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇక కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కిన నేపథ్యంలో.. ఆయనను తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పదవి నుంచి తప్పించి కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ కొత్త బిజెపి అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. కాగా బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ కే ఇలా పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది అంటూ ఎంతో మంది  విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.


 ఇలాంటి సమయంలో వలస వచ్చిన నేతలకు కాదు ఎన్నో రోజుల నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వాలి అంటూ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుపట్టారు. దీంతో ఇలా అధ్యక్ష పదవి కోసం బిజెపిలో ఒక చిన్న సైజు వార్ నడుస్తుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చీప్ గా ఫైటర్ కావాలంటున్నారు. ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావాలా లేకపోతే రియల్ ఫైటర్ కావాలా? ఐదుగురు ముఖ్యమంత్రిలతో కొట్లాడా.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. వీధుల్లో పోరాడే వారు కాదు అంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అయితే రాజాసింగ్ ఈటలను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు అటు రాజా సింగ్ పేరు ప్రస్తావించకపోయిన ఈటెల ఆయనను ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేశారంటూ అందరూ చర్చించుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>