MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawanbb49b3f8-6fbf-49d2-a587-2321fed5e1da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawanbb49b3f8-6fbf-49d2-a587-2321fed5e1da-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత పవన్ ఈ మూవీ కంటే కూడా భీమ్లా నాయక్ మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. దానితో భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడం, విడుదల కాపడం కూడా జరిగింది. కానీ హరిహర వీరమల్లు మూవీ మాత్రం పెండింగ్ లోనే ఉంది. ఇక ఆ తర్వాత పవన్ "బ్రో" అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా పెండింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మరో మూవీ ని మొదలు పెట్టాడు. ఈ pawan{#}Nayak;Director;harish shankar;kalyan;Telugu;Cinema;Andhra Pradeshపవన్ స్ట్రాటజీ అదుర్స్... అలా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది..?పవన్ స్ట్రాటజీ అదుర్స్... అలా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది..?pawan{#}Nayak;Director;harish shankar;kalyan;Telugu;Cinema;Andhra PradeshSun, 23 Jun 2024 15:14:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత పవన్ ఈ మూవీ కంటే కూడా భీమ్లా నాయక్ మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. దానితో భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడం, విడుదల కాపడం కూడా జరిగింది. కానీ హరిహర వీరమల్లు మూవీ మాత్రం పెండింగ్ లోనే ఉంది. ఇక ఆ తర్వాత పవన్ "బ్రో" అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా పెండింగ్లో ఉండగానే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మరో మూవీ ని మొదలు పెట్టాడు.

సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో "ఓజి" అనే మూవీ ని కూడా మొదలు పెట్టాడు. ఇలా మూడు మూవీలను మొదలు పెట్టి ఈ సినిమాలకు సంబంధించిన కొంత కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ హడావిడి ప్రారంభం కావడంతో వాటిపై దృష్టి పెట్టి ఈ సినిమాల షూటింగ్ ను ఆపేశాడు. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి. రిజల్ట్ కూడా వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గెలవడం జరిగింది. దీనితో పవన్ కళ్యాణ్ తాను మొదలు పెట్టిన సినిమాలను పూర్తి చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మొదటగా మొదలు పెట్టిన హరిహర వీరమల్లు సినిమాకు పవన్ ఫస్ట్ డేట్స్ ఇవ్వనున్నట్లు , ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు , ఆ సినిమా పూర్తి కాగానే "ఓజి" సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏ మూవీ అయితే ముందుగా ప్రారంభం అయ్యిందో ఆ సినిమా షూటింగ్ ను ముందుగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూడు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>