PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/thummala-cm-revanth-ponguleti-duddilla-telanatana-030fb5ab-b287-41b7-b2cf-b8447461a4c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/thummala-cm-revanth-ponguleti-duddilla-telanatana-030fb5ab-b287-41b7-b2cf-b8447461a4c0-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు. అంతేకాకుండా పలువురు మంత్రులకు వారి వారి శాఖలను కేటాయించారు. ఇలా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా మహిళలకు ఉచిత బస్సుపై సైన్ చేశారు. ఆ తర్వాత ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, ఇలా ఈ పథకాలన్నీ రన్ అవుతున్నాయి. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా కాబోతోంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తోంది. పాలన బాగానే ఉన్నా కానీ పాలించే నాయకుల మధ్య మాత్రం పొంతన కుదరడం లేదట. రthummala;cm revanth;ponguleti;duddilla;telanatana;{#}surekha vani;srinivas;Deputy Chief Minister;sridhar;NTR;Delhi;dr rajasekhar;Revanth Reddy;Yevaru;Reddy;Telangana;Government;Congress;CM;Ministerసీఎం రేవంత్ కు ఆ ఇద్దరు మంత్రులే కీలకమా..మిగతా వాళ్ళు డమ్మీలేనా.?సీఎం రేవంత్ కు ఆ ఇద్దరు మంత్రులే కీలకమా..మిగతా వాళ్ళు డమ్మీలేనా.?thummala;cm revanth;ponguleti;duddilla;telanatana;{#}surekha vani;srinivas;Deputy Chief Minister;sridhar;NTR;Delhi;dr rajasekhar;Revanth Reddy;Yevaru;Reddy;Telangana;Government;Congress;CM;MinisterSun, 23 Jun 2024 12:12:28 GMT తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు. అంతేకాకుండా పలువురు మంత్రులకు వారి వారి శాఖలను కేటాయించారు.  ఇలా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా  మహిళలకు ఉచిత బస్సుపై సైన్ చేశారు. ఆ తర్వాత ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, ఇలా ఈ పథకాలన్నీ రన్ అవుతున్నాయి.  త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా కాబోతోంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన  నడుస్తోంది. పాలన బాగానే ఉన్నా కానీ పాలించే నాయకుల మధ్య మాత్రం పొంతన కుదరడం లేదట. రేవంత్ రెడ్డి కేవలం కొంతమంది మంత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, మిగతా వాళ్ళని డమ్మీలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ మంత్రులంతా ఆయనపై గుస్సావుతున్నారట. ఇంతకీ ఆ మంత్రులు ఎవరు అనే వివరాలు చూద్దాం.

 ఒక్కసారి కూడా మంత్రి అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయి, ఇప్పటికే పలుసార్లు మంత్రులుగా చేసిన మాపై పెత్తనం చేయడం మాకు నచ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.  అంతేకాకుండా రేవంత్ రెడ్డి తన సొంత నిర్ణయాలతో ఆ ఇద్దరు మంత్రులకు మాత్రమే అన్ని పెత్తనాలు ఇస్తూ,  మిగతా వారంతా వారి దగ్గరికి వెళ్లి ఏ విషయాన్ని అయినా చెప్పుకునే విధంగా చేస్తున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు,దుదిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ  ఇప్పటికే పలుసార్లు మంత్రులుగా పనిచేశారు. ఇందులో దామోదర రాజనర్సింహ డిప్యూటీ సీఎంగా కూడా చేశారు. ఇక తుమ్మల ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా చేశారు. భట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం గా రాజశేఖర్ రెడ్డి హయాంలో చేశారు.  

ఈ విధంగా ఎంతో అపార అనుభవం ఉన్నటువంటి ఈ మంత్రులను కాదని సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు మంత్రులకు మాత్రమే ఏదైనా నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు అప్పజెప్తున్నారట. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు వెల్లడించే అవకాశం వీరికి మాత్రమే ఇస్తున్నారట.  దీంతో మిగతా మంత్రులంతా జనం దృష్టిలో డమ్మీలుగా అవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో నాయకులకు ఏ విషయాన్ని అయినా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది.  కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ స్వేచ్ఛను కాలరాసి తాను మరియు ఇద్దరు మంత్రులు మాత్రమే తెలంగాణ పాలకులుగా ఫీల్ అవుతున్నారని,  మిగతా వారంతా డమ్మీ మంత్రులు అనుకునే విధంగా వ్యవహరిస్తున్నారని వారికి వారే చర్చ చేసుకుంటున్నారట. అంతే కాదు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసి  అక్కడే ఈ పంచాయతీని పూర్తి చేస్తామని అంటున్నారట. ఈ విధంగా లో లోపల జరిగే అంతర్యుద్ధం ఎక్కడ వరకు దారితీస్తుందో ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>