PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp8bd036d5-167e-4213-a8c2-5428a375f41d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp8bd036d5-167e-4213-a8c2-5428a375f41d-415x250-IndiaHerald.jpgగత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు చాలానే ఇబ్బందులు కలిగించింది. 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తన తాడేపల్లి నివాసం పక్కన ఉన్న "ప్రజా వేదిక"ని జగన్ కూల్చివేశారు. దీనిని చంద్రబాబు నిర్మించారు. ఈ భవనాన్ని ప్రభుత్వం అక్రమ నిర్మాణం అని జగన్ అభివర్ణించారు, అయితే బాబు దీనిని విధ్వంసక చర్యగా చూశారు. YCP{#}Lawyer;court;central government;High court;Tadepalli;Friday;Minister;Saturday;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Government;Party;Jagan;YCP;TDP;CBN;Assemblyమొదలైన బాబు బుల్డోజర్ రూల్.. ఏడ్చేస్తున్న వైసీపీ...??మొదలైన బాబు బుల్డోజర్ రూల్.. ఏడ్చేస్తున్న వైసీపీ...??YCP{#}Lawyer;court;central government;High court;Tadepalli;Friday;Minister;Saturday;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Government;Party;Jagan;YCP;TDP;CBN;AssemblySun, 23 Jun 2024 18:02:00 GMT
గత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు చాలానే ఇబ్బందులు కలిగించింది. 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తన తాడేపల్లి నివాసం పక్కన ఉన్న "ప్రజా వేదిక"ని జగన్ కూల్చివేశారు. దీనిని చంద్రబాబు నిర్మించారు. ఈ భవనాన్ని ప్రభుత్వం అక్రమ నిర్మాణం అని జగన్ అభివర్ణించారు, అయితే బాబు దీనిని విధ్వంసక చర్యగా చూశారు.

జగన్ పాలనపై విమర్శలు చేసేందుకు టీడీపీ అధినేత ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఆధిక్యతతో బాబు తిరిగి అధికారంలోకి వచ్చారు. అతను ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదని నిర్ణయించుకున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో కామెంట్లు చేశారు. జగన్ పాలనకు భిన్నంగా మంచి పరిపాలన అందించాలని డిసైడ్ అయినట్లు ఆయన తెలిపారు. కానీ, జగన్‌కి తనకు తేడా లేదని బాబు చూపించారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్ది గంటలకే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించడం ద్వారా బాబు తన అధికారాన్ని చాటుకున్నారు.  

శనివారం తెల్లవారుజామున వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసేందుకు ఏపీ కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ తాడేపల్లిలో బుల్‌డోజర్లు, ఎక్స్‌కవేటర్‌లను మోహరించింది. హైకోర్టు ఆదేశించిన చంద్రబాబు మాత్రం ఆగకుండా దానిని కూల్ చేశారు. "రాష్ట్ర చరిత్రలో ఇలాంటి విధ్వంసం జరగడం ఇదే తొలిసారి. మొదటిసారిగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం, ఎక్స్‌కవేటర్లు, బుల్‌డోజర్లను ఉపయోగించి ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది." అని పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. ఏపీసీఆర్‌డీఏ తొలి చర్యలను సవాల్ చేస్తూ వైసీపీ అంతకుముందు రోజు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూల్చివేత కొనసాగింది.

ఈ కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వును వైస్సార్సీపీ న్యాయవాది APCRDA కమిషనర్‌కు తెలియజేశారు. అయితే, APCRDA కూల్చివేసి కోర్టు ఆదేశాలను ధిక్కరించింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన APCRDA ఇప్పుడు మరింత చట్టపరమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికార ప్రతినిధి తెలిపారు. వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాస్వామ్యవాది కాదని, విధ్వంసకర నేత అభివర్ణించారు. తనకు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం కంటే వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడమే ఆయనకు ముఖ్యమని అంబటి అన్నారు. అయితే ఈ కార్యాలయాలను కూల్చివేస్తుంటే వైసీపీ నేతలు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>