Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panth143bb558-4eff-4145-bb68-b0750ea84ff3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/panth143bb558-4eff-4145-bb68-b0750ea84ff3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీమ్ ఇండియా విజయాల పరంపర కొనసాగుతోంది . ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా వరల్డ్ కప్ టైటిల్ ముద్దాడాలి అనే కసితో ఉంది భారత జట్టు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచే ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా.. ఎంతో అలవోకగా సూపర్ 8 లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సూపర్ 8 దశలో కూడా టీమ్ ఇండియా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లో భPanth{#}India;West Indies;World Cup;Rishabh Pant;ICC T20వరల్డ్ కప్ హిస్టరీలో.. రిషబ్ పంత్ అరుదైన రికార్డ్?వరల్డ్ కప్ హిస్టరీలో.. రిషబ్ పంత్ అరుదైన రికార్డ్?Panth{#}India;West Indies;World Cup;Rishabh Pant;ICC T20Sun, 23 Jun 2024 08:15:00 GMTప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీమ్ ఇండియా విజయాల పరంపర కొనసాగుతోంది . ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా వరల్డ్ కప్ టైటిల్ ముద్దాడాలి అనే కసితో ఉంది భారత జట్టు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచే ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా.. ఎంతో అలవోకగా సూపర్ 8 లో అడుగుపెట్టింది.


 అయితే కీలకమైన సూపర్ 8 దశలో కూడా టీమ్ ఇండియా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్లో భాగంగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన పోరులో 47 పరుగులు తేడాతో విజయాన్ని సాధించింది టీమిండియా. అయితే ఇక ఇటీవల బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోను ఇదే రీతిలో అద్భుతంగా రాణించి  ఏకంగా 50 పరుగుల తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. అయితే ఇలా వరుసగా రెండు విజయాలు సాధించడంతో టీమ్ ఇండియాకు అటు సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు అయిపోయినట్లే అని చెప్పాలి.


 అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాలో అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్ తన ఆట తీరుతో అదరగొడుతున్నాడు భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా ఆదుకుంటున్నాడు  ఈ క్రమంలోనే ఇటీవల ఒక అరుదైన రికార్డు సాధించాడు. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్ గా  టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ ఒక ఎడిషన్ లో అత్యధిక క్యాచ్లు అందుకున్న తొలి వికెట్ కీపర్ గా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఈ వరల్డ్ కప్  ఎడిషన్ లో ఇప్పటి వరకు రిషబ్ పంత్ పది క్యాచ్ లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ క్రిస్ట్ ఏడు క్యాచ్ ల రికార్డును పంత్ బ్రేక్ చేసేసాడు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్న రిషబ్ పంత్.. టీమ్ ఇండియా తరఫున అత్యధిక పరుగుల వీరుడు గా కొనసాగుతున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>