PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-cm-revanth-pochram-srinivas-telanaganaee59f9bc-957e-4a04-882b-0072a42b9c7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-brs-cm-revanth-pochram-srinivas-telanaganaee59f9bc-957e-4a04-882b-0072a42b9c7c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడమే కాకుండా పలువురు నాయకులు మంత్రి పదవులు పొందారు. అంతే కాకుండా ఇంకా కొన్ని మంత్రి పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. అలాంటి తెలంగాణలో ఇప్పటికే వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు, గ్యాస్, ఉచిత కరెంటు, వంటి గ్యారెంటీలు అమలవుతున్నాయి. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా చేయనున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంటే మరోవైపు బీఆర్ఎస్ మరింత చతికిల పడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కూతురు కవిత జైల్లో ఉండగాkcr;brs;cm revanth;pochram srinivas;telanagana{#}KCR;KTR;kavitha;Jeevan Reddy;Leader;Revanth Reddy;Telangana;srinivas;Congress;Reddy;Telangana Chief Minister;News;Government;Ministerతెలంగాణ :'పోచారం'కు లక్కీ ఛాన్స్..కీలక పదవి ఇవ్వనున్న రేవంత్..!తెలంగాణ :'పోచారం'కు లక్కీ ఛాన్స్..కీలక పదవి ఇవ్వనున్న రేవంత్..!kcr;brs;cm revanth;pochram srinivas;telanagana{#}KCR;KTR;kavitha;Jeevan Reddy;Leader;Revanth Reddy;Telangana;srinivas;Congress;Reddy;Telangana Chief Minister;News;Government;MinisterSun, 23 Jun 2024 15:39:44 GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడమే కాకుండా పలువురు నాయకులు మంత్రి పదవులు పొందారు. అంతే కాకుండా ఇంకా కొన్ని మంత్రి పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. అలాంటి తెలంగాణలో ఇప్పటికే వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు, గ్యాస్, ఉచిత కరెంటు, వంటి గ్యారెంటీలు అమలవుతున్నాయి. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా చేయనున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంటే మరోవైపు బీఆర్ఎస్ మరింత చతికిల పడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కూతురు కవిత జైల్లో ఉండగా కేసీఆర్, కేటీఆర్ పై కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విరంతా జైలుకు వెళ్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ పంచన చేరిపోతున్నారు. అయితే తాజాగా  బీఆర్ఎస్ లో ఉండే కీలక లీడర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితమే కాంగ్రెస్ లోనే మొదలైందని చెప్పుకొచ్చారు.  కాంగ్రెస్ పాలన బాగుందని అందుకే నేను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు.  అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఆయనకు  ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తారని వార్తలు ఊపందుకున్నాయి.

ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఆయనకు పదవి ఇస్తానని చెప్పిన తర్వాతే ఆయన ఈ పార్టీలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. పదవుల వ్యామోహంతో పార్టీలు మార్చే వారిని కాంగ్రెస్ లో చేరుకోవడం మంచి పద్ధతి కాదని ఇప్పటికే జీవన్ రెడ్డి అన్నారు ఇప్పటికే 65 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ఇంకా మిగతా నాయకులు కాంగ్రెస్ లోకి ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నాయకులంతా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ముట్టరించారు. కేసీఆర్ హయాంలో కీలక లీడర్ గా, స్పీకర్ గా చేసిన నువ్వు పార్టీని మోసం చేసి ఇలా బయటకు వెళ్లడం సబబు కాదని బీఆర్ఎస్ నాయకులంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>