PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyb071a161-802a-4477-aaa2-939372b317df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyb071a161-802a-4477-aaa2-939372b317df-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురువు శిష్యులు అని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా... అదే నిజం. జడ్పిటిసి స్థాయి నుంచి... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదిగాడంటే... దాని వెనుక టిడిపి పార్టీ కచ్చితంగా ఉంది. tdp{#}revanth,Telangana Chief Minister,Telangana,TDP,Revanth Reddy,CM,Varsham,Yevaru,CBN,Assembly,Telugu,Telugu Desam Party,Reddy,Congress,News,Andhra Pradeshచంద్రబాబు : టీడీపీని మళ్లీ లేపుతున్న రేవంత్‌ రెడ్డి?చంద్రబాబు : టీడీపీని మళ్లీ లేపుతున్న రేవంత్‌ రెడ్డి?tdp{#}revanth,Telangana Chief Minister,Telangana,TDP,Revanth Reddy,CM,Varsham,Yevaru,CBN,Assembly,Telugu,Telugu Desam Party,Reddy,Congress,News,Andhra PradeshSun, 23 Jun 2024 10:36:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురువు శిష్యులు అని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా... అదే నిజం. జడ్పిటిసి స్థాయి నుంచి... ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదిగాడంటే... దాని వెనుక టిడిపి పార్టీ కచ్చితంగా ఉంది.

అలాగే... తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి...  కావడానికి ఇండైరెక్టుగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.  ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే కేసీఆర్ను ఓడించేందుకు.... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో జైల్లో ఉన్న చంద్రబాబు... అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే.. తెలంగాణ టిడిపి నేతలు సపోర్ట్ ఇచ్చేలా కీలక ఆదేశాలు కూడా ఇచ్చారట చంద్రబాబు నాయుడు. దాని ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత... చంద్రబాబు తన గురువు కాదని... సహచరుడు మాత్రమే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఏపీ అలాగే తెలంగాణలో ఉన్న టిడిపి నేతలు రేవంత్ రెడ్డి పై సీరియస్ అయ్యారు.

అయితే ఆ వివాదాన్ని.. చల్లబరిచేందుకు తాజాగా... రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఒకరోజులో 18 గంటలకు పైగా పని చేసే వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి ఏపీలో ఉన్న సమయంలో..  నేను తెలంగాణ డెవలప్మెంట్ చేసేందుకు రోజంతా పని చేయాలి అంటూ... చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. అలాగే చంద్రబాబు నాయుడు కారణంగానే ఈ స్థాయికి వచ్చామని అర్థం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు... రేవంత్ రెడ్డి పై చల్లబట్టినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>