BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravati40720e19-348e-495a-aa54-2efca440a155-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravati40720e19-348e-495a-aa54-2efca440a155-415x250-IndiaHerald.jpgవిజయవాడ ఇంద్రకీలాద్రికి రాజధాని రైతుల పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని 2020 జనవరిలో చేపట్టిన పాదయాత్రకు అప్పటి జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. సీడ్ యాక్సిస్ రహదారిపై మహిళలను అడ్డుకుని పోలీసులు లాఠీఛార్జి చేశారు. అందువల్ల బెజవాడ దుర్గమ్మకు రాజధాని మహిళలు మొక్కు తీర్చుకోలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అమరావతి అనుకూల ప్రభుత్వం వచ్చేసింది. అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు అమరావతి రైతులు దుర్గమ్మ సన్నిధికి బయలుదేరారు. తుళ్లూరు నుంచి ఇంద్రamaravati{#}Amaravati;Government;police;Capital;2020;Anandam;CBN;Jaganఅమరావతి: జగన్‌ ఆపించిన యాత్ర.. బాబు రాగానే ప్రారంభం?అమరావతి: జగన్‌ ఆపించిన యాత్ర.. బాబు రాగానే ప్రారంభం?amaravati{#}Amaravati;Government;police;Capital;2020;Anandam;CBN;JaganSun, 23 Jun 2024 07:19:10 GMTవిజయవాడ ఇంద్రకీలాద్రికి రాజధాని రైతుల పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని 2020 జనవరిలో చేపట్టిన పాదయాత్రకు అప్పటి జగన్  ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. సీడ్ యాక్సిస్ రహదారిపై మహిళలను అడ్డుకుని పోలీసులు లాఠీఛార్జి చేశారు. అందువల్ల బెజవాడ దుర్గమ్మకు రాజధాని మహిళలు మొక్కు తీర్చుకోలేకపోయారు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అమరావతి అనుకూల ప్రభుత్వం వచ్చేసింది. అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు అమరావతి రైతులు దుర్గమ్మ సన్నిధికి బయలుదేరారు. తుళ్లూరు నుంచి ఇంద్రకీలాద్రి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. అప్పట్లో గత ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని గ్రామాల్లో ఊరూరా శిబిరాలు ఏర్పాటు చేసుకుని సంవత్సరాల తరబడి దీక్షలు చేశారు. అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ రావడంతో అమరావతి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>