Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiab49d8672-da11-48e5-acba-141cea63a5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiab49d8672-da11-48e5-acba-141cea63a5bc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న t20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి తప్పులు చేయకుండా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే లీగ్ స్టేజిలో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా ఎంతో అలవోకగా సూపర్ 8 దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సూపర్ 8 పోరులో కూడా అదరగొడుతుంది. కాగా ఇప్పటికే ఈ కీలకమైన పోరులో ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కIndia{#}Pakistan;Australia;ICC T20;World Cup;Indiaఅదే జరిగితే.. భారత్ వరల్డ్ కప్ నుంచి ఔటేనా?అదే జరిగితే.. భారత్ వరల్డ్ కప్ నుంచి ఔటేనా?India{#}Pakistan;Australia;ICC T20;World Cup;IndiaFri, 21 Jun 2024 19:30:00 GMTప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న t20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి తప్పులు చేయకుండా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే లీగ్ స్టేజిలో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా ఎంతో అలవోకగా సూపర్ 8 దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సూపర్ 8 పోరులో కూడా అదరగొడుతుంది. కాగా ఇప్పటికే ఈ కీలకమైన పోరులో ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొని ఘన విజయాన్ని అందుకుంది.


 మరో రెండు మ్యాచ్ లలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో అమీతుమీ తేల్చుకోవడానికి  రెడీ అవుతుంది టీమిండియా. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని టీమిండియా సూపర్ 8 ఎంత మేరకు రాణిస్తుంది అన్నది మాత్రం అందరిలో నెలకొన్న ప్రశ్న   ఎందుకంటే గత ఎనిమిది టి20 ప్రపంచ కప్ ఎడిషన్ లలో చూసుకుంటే సూపర్ 8 రౌండ్లో టీమ్ ఇండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసింది. దీంతో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఇక ఆందోళన చెందుతున్నారు. ఈసారి అద్భుతంగా రాణించాలని అనుకుంటున్నారు.


 ఏదైనా తేడా జరిగింది అంటే ఇక అటు టీమిండియా అర్ధాంతరంగా ట్రోఫీ అందుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని ఎంతో మంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ ఎడిషన్లు పాకిస్తాన్ ను ఓడించి తొలి టైటిల్ కైవసం చేసుకుంది టీమ్ ఇండియా. ఆ తర్వాత 2009లో రెండో ఎడిషన్ లో సూపర్ 8 లోకి ప్రవేశించింది. ఇక సూపర్ 8 లో జరిగిన మూడు మ్యాచ్ లలో ఓడిపోయి వరల్డ్ కప్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. 2010 t20 ప్రపంచకప్ లోను ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ తర్వాత కూడా సూపర్ 8 ప్రవేశించిన టీమిండియా అక్కడ మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇలా ఇప్పటివరకు టి20  ప్రపంచ కప్ టోర్నీలో సూపర్ 8 చెత్త గణాంకాలనే నమోదు చేసింది టీమ్ ఇండియా  మరి ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో మొదటి సూపర్ 8 మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా మరో రెండు మ్యాచ్ లలో ఎలా రాణిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>