MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగతవారం విడుదలైన విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీ ఊహించని ఘన విజయం సాధించడంతో ఇలాంటి సినిమాలు మన టాప్ సీనియర్ హీరోలలో ఎవరో ఒకరు ఎందుకు చేయరు అన్న చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఈమూవీలో విజయ్ సేపుపతి నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూతురు సెంటిమెంట్ తో తీయబడ్డ ఈమూవీ కలక్షన్స్ కూడ బాగానే ఉండటంతో ఈ నెల 27న రాబోతున్న ‘కల్కీ’ విడుదల అయ్యేంతవరకు ఈ ‘మహారాజ’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోందే. అయితే ఇలాంటి మంచి సినిమాల chirangeevi{#}Balakrishna;Akkineni Nagarjuna;vijay sethupathi;Remake;Audience;Chiranjeevi;Venkatesh;Hero;Yevaru;News;producer;Producer;Joseph Vijay;Cinemaమహారాజ తో టాప్ సీనియర్ హీరోలకు సమస్యలు !మహారాజ తో టాప్ సీనియర్ హీరోలకు సమస్యలు !chirangeevi{#}Balakrishna;Akkineni Nagarjuna;vijay sethupathi;Remake;Audience;Chiranjeevi;Venkatesh;Hero;Yevaru;News;producer;Producer;Joseph Vijay;CinemaFri, 21 Jun 2024 08:06:00 GMTగతవారం విడుదలైన విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీ ఊహించని ఘన విజయం సాధించడంతో ఇలాంటి సినిమాలు మన టాప్ సీనియర్ హీరోలలో ఎవరో ఒకరు ఎందుకు చేయరు అన్న చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఈమూవీలో విజయ్ సేపుపతి నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



కూతురు సెంటిమెంట్ తో తీయబడ్డ ఈమూవీ కలక్షన్స్ కూడ బాగానే ఉండటంతో ఈ నెల 27న రాబోతున్న ‘కల్కీ’ విడుదల అయ్యేంతవరకు ఈ ‘మహారాజ’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోందే. అయితే ఇలాంటి మంచి సినిమాల మధ్య విడుదలైన చాల మీడియం రేంజ్ చిన్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో ఈనెలాఖరి వరకు ‘మహారాజ’ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది.



ఈ నేపధ్యంలో ఎవరైనా మంచి అభిరుచిగల నిర్మాత ఇలాంటి సినిమాను తెలుగులో తీయాలి అని ప్రయత్నిస్తే విజయ్ సేతుపతి పోషించిన బార్బర్ పాత్రకు ఏ సీనియర్ హీరో సరిపోతాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సీనియర్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున లలో ఎవరు విజయ్ సేతుపతి పోషించిన పాత్రకు ఎవరు సరిపోతారు అంటూ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే చాలమంది సినిమా అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తూ కొంతవరకు విజయ్ సేతుపతి పరోక్షంగా కామెంట్స్ పెడుతున్నారు.



వాస్తవానికి విజయ్ సేతుపతి నటించిన ఆపాత్రకు చిరంజీవి సరిపోతాడని కొందరు అభిప్రాయ పడుతుంటే మరికొందరు వెంకటేష్ ఈ పాత్రలో నటించి ఉంటే జాతీయ స్థాయిలో వెంకటేష్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడటమే కాకుండా అతడి కెరియర్ లో మరొక దృశ్యం అయి ఉండేది అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈకామెంట్స్ ప్రభావితమైన నాగార్జున బాలకృష్ణ అభిమానులు తమ హీరో ఈమూవీని రీమేక్ చేసి ఉంటే జాతీయ అవార్డు వచ్చి ఉండేది అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>