PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy55745048-78c6-4c89-a94a-1cfbdc70c202-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy55745048-78c6-4c89-a94a-1cfbdc70c202-415x250-IndiaHerald.jpg•జనాల దెబ్బకి కూలబడ్డ జగన్ •మనసు మార్చుకొని అసెంబ్లీకి యూటర్న్ ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. నిజానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని జగన్ మోహన్ రెడ్డి చాలా గట్టిగా భావించారు.గెలుస్తామనే నమ్మకంతో చాలా హుషారుగా ఆయన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. లండన్ సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ పాపం ఆయన ఆశ పడ్డట్టు ఫలితం రాలేదు. కనీస మెజారిటీ అయినా దక్కుతుందని భావించిన వైసీపీ నాయకjaganmohanreddy{#}london;U Turn;SV Mohan Reddy;News;Andhra Pradesh;CM;Assembly;India;Jagan;Party;YCPజగన్ అసెంబ్లీ ఏంట్రీ: ఎట్లయితే అట్లా.. తగ్గేదేలే?జగన్ అసెంబ్లీ ఏంట్రీ: ఎట్లయితే అట్లా.. తగ్గేదేలే?jaganmohanreddy{#}london;U Turn;SV Mohan Reddy;News;Andhra Pradesh;CM;Assembly;India;Jagan;Party;YCPFri, 21 Jun 2024 11:56:29 GMT•జనాల దెబ్బకి కూలబడ్డ జగన్
•మనసు మార్చుకొని అసెంబ్లీకి యూటర్న్

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్) : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. నిజానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని జగన్ మోహన్ రెడ్డి చాలా గట్టిగా భావించారు.గెలుస్తామనే నమ్మకంతో చాలా హుషారుగా ఆయన ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. లండన్ సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ పాపం ఆయన ఆశ పడ్డట్టు ఫలితం రాలేదు. కనీస మెజారిటీ అయినా దక్కుతుందని భావించిన వైసీపీ నాయకులకు ఆంధ్రా జనాలు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు. కనీసం ప్రతి పక్ష హోదా కూడా దక్కని రీతిలో 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కాలంటే ఖచ్చితంగా 15 శాతం సీట్లు ఉండాలి.అంటే వైసీపీకి కనీసం 18 స్థానాలు అయినా దక్కి ఉండాలి. కానీ, ప్రజలు మాత్రం వైసీపీని కేవలం 11 అంటే 11 స్థానాలకే పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారు.

దీంతో ఒకప్పుడు 151 స్థానాలతో పులిలా అసెంబ్లీలో అడుగు పెట్టిన జగన్‌.. ఇప్పుడు 11 మందితో అసెంబ్లీకి వెళ్లాలంటే పిల్లిలా భయపడే పరిస్థితి వచ్చింది. ఈ ఓటమిని ఎంతో అవమానంగా వైసీపీ నాయకులు భావించారు. దాదాపు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే విషయంపై అంతర్మథనం చెందారు. ఇక, అసెంబ్లీకి వెళ్లకూడదని త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కానీ వెనక్కి తగ్గితే అధికార పార్టీ వాళ్ళు ఇంకా దారుణంగా ఆడుకుంటారని భావించి ఎలా అయితే అలా అయ్యింది ఖచ్చితంగా అసెంబ్లీ ఎంట్రీ ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.అందుకే అతి త్వరలోనే ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన షెడ్యూల్లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్న జగన్ మోహన్ రెడ్డి దీనిని ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఆ రోజు తప్పనిసరిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>