PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-mlas-take-oath-these-are-the-rules293b5ddd-7664-40e0-a43f-90deafc1d9c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-mlas-take-oath-these-are-the-rules293b5ddd-7664-40e0-a43f-90deafc1d9c6-415x250-IndiaHerald.jpg- ఆంగ్ల అక్ష‌రాల ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో ప్ర‌మాణ స్వీకారం - ప్ర‌మాణ స్వీకారం పూర్త‌య్యాక స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌ ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు ఉంటాయి. ఈ స‌మావేశాల్లో జ‌రిగేదేం ఉండ‌దు. కానీ కొత్త‌గా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు మాత్ర‌మే వీటిని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులతో ప్రమాణం చేయించ‌డానికి ముందుగా ఈ శాస‌న‌న‌AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLAs ; ap; AP assembly; rules{#}Friday;CBN;India;Telangana Chief Minister;Bharatiya Janata Party;MLA;TDP;YCP;Assemblyఎమ్మెల్యేలు ఎలా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.. ఆ రూల్స్ ఇవే..!ఎమ్మెల్యేలు ఎలా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.. ఆ రూల్స్ ఇవే..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLAs ; ap; AP assembly; rules{#}Friday;CBN;India;Telangana Chief Minister;Bharatiya Janata Party;MLA;TDP;YCP;AssemblyFri, 21 Jun 2024 11:31:00 GMT- ఆంగ్ల అక్ష‌రాల ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో ప్ర‌మాణ స్వీకారం
- ప్ర‌మాణ స్వీకారం పూర్త‌య్యాక స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ
స‌మావేశాలు ఉంటాయి. ఈ స‌మావేశాల్లో జ‌రిగేదేం ఉండ‌దు. కానీ కొత్త‌గా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు మాత్ర‌మే వీటిని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులతో ప్రమాణం చేయించ‌డానికి ముందుగా ఈ శాస‌న‌న‌స‌భ‌కు ప్రొటెం స్పీక‌ర్‌గా ఎన్నికైన రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్రొటెం స్పీక‌ర్ హోదాలో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో ఆంగ్ల అక్ష‌ర క్ర‌మంలో ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు.


కొత్త శాస‌న‌స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక ఉంటుంది. ఈ రోజులోనే అంద‌రూ ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌పోవ‌చ్చు. కొంద‌రు ఈ రోజు.. మ‌రి కొంద‌రు రేపు ప్ర‌మాణ స్వీకారం చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక, తొలి అసెంబ్లీ సమావేశంలో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన త‌ర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరి త‌ర్వాత ఎమ్మెల్యేలు ఆంగ్ల అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌) లో ప్రమాణ స్వీకారం చేస్తారు.


ఒక్కొక్క‌రిని ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి ఆహ్వానిస్తూ వారితో ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఈ రోజు శాస‌న‌సభ్యుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వ వేళ కొత్త ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యుల‌తో పాటు మ‌రెవ్వ‌రికి అసెంబ్లీలోకి అనుమతి ఇవ్వలేదు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌లు జారీ నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కొత్త అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల‌కు గాను  టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఇక జ‌న‌సేన మొత్తం 21 చోట్ల పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ గెలిచింది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి.. 8 స్థానాలను గెలుచుకుంది. వైసీపీ మొత్తం 175 స్థానాల‌కు పోటీ చేసి కేవ‌లం 11 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>