PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagananna-who-is-shocked-by-the-politics-of-ycp-leaders80e2c2d3-d36d-4024-9808-4ee6ff7ed772-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagananna-who-is-shocked-by-the-politics-of-ycp-leaders80e2c2d3-d36d-4024-9808-4ee6ff7ed772-415x250-IndiaHerald.jpgఆంధ్రాలో వైసీపీ ఘోర పరాజయం తరువాత వారికి అనేక అనుమానాలు చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు విపక్షం అయినటువంటి టీడీపీ మీద ఆరోపణలు చేసే నేతలు ఇపుడు సొంత నేతలనే అనుమానించే పరిస్థితికి వచ్చారు. మరీ ముఖ్యంగా అధినేత జ‌గ‌న్‌కు సైతం అంతు చిక్క‌కుండా.. కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుస్తార‌ని అనుకున్న నాయ‌కులు.. కూడా ఓడిపోయారు. మొత్తంగా 164 మంది నాయ‌కులు ఓడిపోవ‌డం పట్ల అధినేత చాలా అసహనంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు వjagan{#}TDP;YCP;Partyవైసీపీ నేత‌ల రాజ‌కీయం చూసి ఖంగుతిన్న జగనన్న... అరె ఏంట్రా ఇది?వైసీపీ నేత‌ల రాజ‌కీయం చూసి ఖంగుతిన్న జగనన్న... అరె ఏంట్రా ఇది?jagan{#}TDP;YCP;PartyFri, 21 Jun 2024 14:04:51 GMTవైసీపీ ఘోర పరాజయం తరువాత వారికి అనేక అనుమానాలు చుట్టుముట్టాయి. నిన్న మొన్నటి వరకు విపక్షం అయినటువంటి టీడీపీ మీద ఆరోపణలు చేసే నేతలు ఇపుడు సొంత నేతలనే అనుమానించే పరిస్థితికి వచ్చారు. మరీ ముఖ్యంగా అధినేత జ‌గ‌న్‌కు సైతం అంతు చిక్క‌కుండా.. కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుస్తార‌ని అనుకున్న నాయ‌కులు.. కూడా ఓడిపోయారు. మొత్తంగా 164 మంది నాయ‌కులు ఓడిపోవ‌డం పట్ల అధినేత చాలా అసహనంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న 164 మందిలో దాదాపుగా 40 – 60 మంది ప‌క్క చూపులు చూస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. వారు పార్టీ మారిపోవ‌డం ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు. ఆ అవకాశం దొరకనప్పుడు అవ‌కాశం సృష్టించుకునై నా.. పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నించేలా పన్నాగాలు పన్నుతున్నారని వినికిడి. ముఖ్యంగా వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు న‌డుపుతున్న వారంతా ఈ జాబితాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కొంద‌రు ఎన్నిక‌ల‌కు ముందు జారుకోగా.. ఇప్పుడు ఓడిన నాయ‌కులు మ‌రింత మంది పార్టీకి టాటా చెప్ప‌నున్నారన్నమాట.

ఇక విశ్లేషకులు ఈ గుసగుసలు వెనుక వాస్తవం లేకపోలేదు అని అంటున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఐదేళ్ల పాటు వారు వైసీపీలోనే ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు అనేవి త‌ప్ప‌వు. మ‌రికొంద‌రు రాజ‌కీయంగా ప్రాధాన్యత చూసుకుంటున్నారు. ఇక్కడ వింత ఏంటంటే.. ప్ర‌స్తుతం వినిపిస్తున్న పేర్ల‌లో చాలా మంది గ‌తంలో ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసి వ‌చ్చిన వారే కావ‌డం కొసమెరుపు. మ‌రి వీరి వ్యూహాల‌ను జ‌గ‌న్ ప‌సిగ‌ట్టే ఉంటారు. సో.. ఏం చేస్తారో వేచి చూడాలి. అయితే ఇక్కడ ఎవరెవరు జంప్ జిలానీ అవుతారో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు! మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉంటారో మీరు ఊహించగలరా? అలా అయితే ఇక్కడ కామెంట్ చేయండి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>