PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-employees-beat-babu-and-put-him-in-the-oven-from-penam6eb292ff-1e2f-4a07-b374-cb114707cf95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-employees-beat-babu-and-put-him-in-the-oven-from-penam6eb292ff-1e2f-4a07-b374-cb114707cf95-415x250-IndiaHerald.jpgఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధినేత జగన్‌ను గద్దె దించాలని చాలా వర్గాలు కసితో పని చేశాయి. అలాంటి వారిలో ఉద్యోగస్తులు ఒకరు. ఉద్యోగస్తులు చాలా కసితో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి ఓట్లు వేశారు. వారు వేయడంతో పాటు.. వారు ఎన్నికలలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చాలా వరకు కూటమి విజయం సాధించడానికి సహాయ సహకారాలు అందించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన రెండు వారాలలోనే ఎక్కువగా దాడులకు గురవుతోంది ఎవరు అని ప్రశ్నించుకుంటే.. ముందుగా వినిపించేది ఉద్యోగుల పేర్లే కావడం విశేషం. అందరినీ కాకపోయినాAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; AP employees{#}anitha singer;Ishtam;Traffic police;రాజీనామా;Turmeric;police;Manam;Yevaru;Government;Telugu Desam Party;Minister;Jagan;YCPఏపీ ఉద్యోగులు బాబును గెలిపించి పెనం మీద నుంచి పొయ్య‌లో ప‌డ్డారే.. !ఏపీ ఉద్యోగులు బాబును గెలిపించి పెనం మీద నుంచి పొయ్య‌లో ప‌డ్డారే.. !AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; AP employees{#}anitha singer;Ishtam;Traffic police;రాజీనామా;Turmeric;police;Manam;Yevaru;Government;Telugu Desam Party;Minister;Jagan;YCPFri, 21 Jun 2024 11:25:00 GMTఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధినేత జగన్‌ను గద్దె దించాలని చాలా వర్గాలు కసితో పని చేశాయి. అలాంటి వారిలో ఉద్యోగస్తులు ఒకరు. ఉద్యోగస్తులు చాలా కసితో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి ఓట్లు వేశారు. వారు వేయడంతో పాటు.. వారు ఎన్నికలలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చాలా వరకు కూటమి విజయం సాధించడానికి సహాయ సహకారాలు అందించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన రెండు వారాలలోనే ఎక్కువగా దాడులకు గురవుతోంది ఎవరు అని ప్రశ్నించుకుంటే.. ముందుగా వినిపించేది ఉద్యోగుల పేర్లే కావడం విశేషం. అందరినీ కాకపోయినా కొందరు ఉద్యోగులు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ అండదండలు చూసుకుని రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు.


వీరులో ప్రభుత్వ అధికారులతో పాటు.. కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంటెలిజెన్స్‌ భాగంలో పనిచేసిన అధికారులు, పోలీసులు ఇలా చాలామంది అప్పటి ప్రతిపక్షాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారు. ఆ కోపం కావచ్చు.. లేదా ఉద్యోగులకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత చేసిన తనను ఓడించారన్న ఇది కావచ్చు చంద్ర‌బాబు కూడా ఈ సారి ఉద్యోగుల విష‌యంలో లైట్‌గానే ఉంటున్నారు. అందుకే ఆయ‌న బ్యూరోక్రాట్ పాల‌న కాకుండా రాజ‌కీయ పాల‌న ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.


ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేరుగా మంత్రులు సైతం ఉద్యోగులను టార్గెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తూ వస్తోంది. ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఇంకా వైసీపీ రక్తం ప్రవహించే పోలీస్ డిపార్ట్మెంట్‌లో పని చేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లి వైసీపీలో పని చేసుకోవచ్చని ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మరో మంత్రి అచ్చెం నాయుడు అయితే గత ఐదేళ్లలో ఉద్యోగస్తుల తీరుతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిల్ల‌ పట్టుకుని వెళితే ఉద్యోగస్తులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేసి పంపించాలని.. అలా చేయని ఉద్యోగస్తుల సంగతి తాను చూస్తానని.. ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు.


ఇక మరో ఇద్దరు సీనియర్ నాయకులు అయితే ఏకంగా నా కొడకల్లారా నరుకుతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకుల్లో.. భయం, ఆందోళన అయితే మొదలైంది. మనం జగన్ కాదని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇలా టార్గెట్ అవుతున్నాం ఏంటన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే తమకు సహకరించిన ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>