Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0288b2ba-bf7c-4c6e-9207-729e1f5edb9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0288b2ba-bf7c-4c6e-9207-729e1f5edb9a-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగు లేని పార్టీగా ప్రస్తానాన్ని కొనసాగించిన బిఆర్ఎస్ ఇక రానున్న రోజుల్లో పూర్తిగా ఖాళీ కాబోతుందా.. కేవలం ఆ కేసిఆర్ కుటుంబానికి సంబంధించిన నేతలు తప్ప మిగతా అందరూ కూడా ఆ పార్టీ విడబోతున్నారా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు నోటి నుండి అవును అనే సమాధానం వినిపిస్తుంది. వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన బిఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఏకంగా విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారKcr{#}srihari;Mohandas Karamchand Gandhi;Avunu;Government;sudigali sudheer;Telangana;Dalapathi;Congress;srinivas;MLA;Party;Joseph Vijay;Car;Newsకాంగ్రెస్ లోకి వెళ్ళబోయే ఎమ్మెల్యేల లిస్ట్ ఇదేనట.. ఇంకేముంది కారు ఖాళీనేనా?కాంగ్రెస్ లోకి వెళ్ళబోయే ఎమ్మెల్యేల లిస్ట్ ఇదేనట.. ఇంకేముంది కారు ఖాళీనేనా?Kcr{#}srihari;Mohandas Karamchand Gandhi;Avunu;Government;sudigali sudheer;Telangana;Dalapathi;Congress;srinivas;MLA;Party;Joseph Vijay;Car;NewsFri, 21 Jun 2024 19:00:00 GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగు లేని పార్టీగా ప్రస్తానాన్ని కొనసాగించిన బిఆర్ఎస్ ఇక రానున్న రోజుల్లో పూర్తిగా ఖాళీ కాబోతుందా.. కేవలం ఆ కేసిఆర్ కుటుంబానికి సంబంధించిన నేతలు తప్ప మిగతా అందరూ కూడా ఆ పార్టీ విడబోతున్నారా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు నోటి నుండి అవును అనే సమాధానం వినిపిస్తుంది. వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన బిఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే ఏకంగా విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.


 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో నిర్మహమాటంగా కారు పార్టీలోని కీలక నేతలందరూ ఇక కారు దిగి చేయి అందుకుంటున్నారు. ఇక ఇప్పటికే అటు గులాబీ దళపతి కేసీఆర్కు ఎంతో ఆప్తుడిగా ఉన్న కేకే.. అదే సమయంలో అటు కెసిఆర్ నమ్మిన బంటుగా ఉన్న కడియం శ్రీహరి లాంటి నేతలు సైతం కారు పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారిపోయింది. అయితే ఇటీవల ఏకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్పీకర్గా వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగిన కెసిఆర్ అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ఇక కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు.


 దీంతో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది  అయితే ఏకంగా 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తుండగా.. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వారి పేర్లను లీక్ చేశారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న ఎమ్మెల్యేలలో ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్, కేవీ వివేకానంద, గూడె మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ సహ మరికొంతమంది ఉన్నారట. ఇప్పటికే లోలోపల సంప్రదింపులు జరుపుతున్నారని మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని దానం చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>