PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/reavanth-reddy-congress-party-tseca1a65b-dfd1-4665-b294-3ac5295e925c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/reavanth-reddy-congress-party-tseca1a65b-dfd1-4665-b294-3ac5295e925c-415x250-IndiaHerald.jpgఈసారి లోక్సభ ఎన్నికలలో ఇండియా కూటమి 234 స్థానాలలో గెలిచింది. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే పార్టీ హైకేమాండ్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది.. ఏ ఏ రాష్ట్రాలలో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే విషయం పైన ఒక జాబితాలను సైతం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది రాష్ట్రాలలో చాలా ప్రభావం చూపించినట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా మధ్యప్రదేREAVANTH REDDY;CONGRESS PARTY;TS{#}revanth;Revanth Reddy;MIM Party;Telangana;MP;Congress;India;Hanu Raghavapudi;Bharatiya Janata Party;Partyరేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిందా..?రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిందా..?REAVANTH REDDY;CONGRESS PARTY;TS{#}revanth;Revanth Reddy;MIM Party;Telangana;MP;Congress;India;Hanu Raghavapudi;Bharatiya Janata Party;PartyThu, 20 Jun 2024 08:00:00 GMTఈసారి లోక్సభ ఎన్నికలలో ఇండియా కూటమి 234 స్థానాలలో గెలిచింది. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే పార్టీ హైకేమాండ్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది.. ఏ ఏ రాష్ట్రాలలో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే విషయం పైన ఒక జాబితాలను సైతం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది రాష్ట్రాలలో చాలా ప్రభావం చూపించినట్లుగా తెలియజేశారు.


ముఖ్యంగా మధ్యప్రదేశ్, చతిస్గడ్, ఢిల్లీ, ఒడిస్సా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరకాండ, కర్ణాటక ,తెలంగాణ 8 రాష్ట్రాలకు హై కమాండ్ కమిటీ సభ్యులను సైతం నియమించింది. వీళ్ళందరూ కూడా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటింగ్ శాతం తగ్గిందనే విషయం పైన అంచనా వేసి ఒక రిపోర్టును సైతం విడుదల చేశారట. అయితే అలా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లిస్టులో తెలంగాణ కూడా ఉండడం గమనార్హం. దీంతో రేవంత్ రెడ్డికి కాస్త షాక్ తగిలినట్లుగా కనిపిస్తోంది.


ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈసారి లోక్సభ ఎన్నికలలో బిజెపికి సమానంగా ఎంపీ సీట్లు సైతం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో అధికారంలో లేకపోయినా బిజెపి పార్టీ కూడా 8 స్థానాలు దక్కించుకుంది. మిగిలిన స్థానాలను ఎంఐఎం పార్టీ కూడా దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలుచుకోక ఈసారి పదికి పైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కార్ అనుకున్నప్పటికీ కేవలం ఎనిమిది స్థానాలు రావడం అది కూడా బిజెపి పార్టీ ఓటింగ్ కూడా పెరగడం కాంగ్రెస్ పార్టీని అసంతృప్తికి గురిచేస్తుందట. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపని కొన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందని పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పుంజుకునే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>