Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9c618dbb-5636-4a4f-8780-88cabec4f782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9c618dbb-5636-4a4f-8780-88cabec4f782-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ గురించి నిత్యం ఎదో ఒక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నేపాటిజం ఎక్కువగా ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. అలాగే అక్కడ లింగవివక్ష పై కూడా చాలా మంది మాట్లాడారు.సినీ సెలబ్రేటీలు కూడా బాలీవుడ్ లో లింగ వివక్ష పై మాట్లాడారు. మేల్ డామినేటెడె ఇండస్ట్రీ అని గతంలో చాలా మంది ముద్దుగుమ్మలు మీడియా ముందు మాట్లాడారు. పారితోషికం విషయంలోనూ మెల్ డామినేషన్ ఉంటుందని చాలా మంది హీరోయిన్లు మండిపడుతున్నారు. కంగనా రనౌత్, దీపిక పదుకొణే, కరీనా కపూర్, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు చాలా సందర్భsocialstars lifestyle{#}Ram Charan Teja;Kangana Ranaut;deepika;neha sharma;priyanka;media;Industry;Heroine;Chirutha;bollywood;Teluguసోషల్ మీడియాని షేక్ చేస్తున్న "చిరుత" బ్యూటీ కామెంట్స్..?సోషల్ మీడియాని షేక్ చేస్తున్న "చిరుత" బ్యూటీ కామెంట్స్..?socialstars lifestyle{#}Ram Charan Teja;Kangana Ranaut;deepika;neha sharma;priyanka;media;Industry;Heroine;Chirutha;bollywood;TeluguThu, 20 Jun 2024 16:10:01 GMTబాలీవుడ్ గురించి నిత్యం ఎదో ఒక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నేపాటిజం ఎక్కువగా ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. అలాగే అక్కడ లింగవివక్ష పై కూడా చాలా మంది మాట్లాడారు.సినీ సెలబ్రేటీలు కూడా బాలీవుడ్ లో లింగ వివక్ష పై మాట్లాడారు. మేల్ డామినేటెడె ఇండస్ట్రీ అని గతంలో చాలా మంది ముద్దుగుమ్మలు మీడియా ముందు మాట్లాడారు. పారితోషికం విషయంలోనూ మెల్ డామినేషన్ ఉంటుందని చాలా మంది హీరోయిన్లు మండిపడుతున్నారు. కంగనా రనౌత్, దీపిక పదుకొణే, కరీనా కపూర్, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో లింగ వివక్ష పై కామెంట్స్ చేశారు.కంగనా రనౌత్ అయితే చాలా సార్లు దీని పై మండిపడింది. లింగ వివక్ష కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డాను అని తెలిపింది. అలాగే తాను చాలా ఆఫర్స్ కూడా కోల్పోయాను అని తెలిపింది కంగన. ఇప్పుడు కంగన మాదిరిగానే మరో ముద్దుగుమ్మ కూడా బాలీవుడ్ లో లింగ వివక్ష పై మాట్లాడింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ చిరుత హీరోయిన్ నేహాశర్మ. మెల్ డామినేషన్ గురించి నేహా శర్మ మాట్లాడుతూ.. లింగవివక్ష కారణంగా తాను చాలా ఇబ్బందిపడుతున్నట్టు తెలిపింది. తనలానే చాలా మంది అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుందని ఆమె ఆరోపించింది.

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. కానీ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అవకాశాల కోసం రాజీపడాలా.? మహిళా అయితే అంత దిగజారాల్సిన పని ఉందా.? హీరోలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వేన ఏకారణం ఏంటి.? అని ప్రశ్నించింది. అలాగే మహిళలు ఈ రకమైన వివక్షను అన్ని రంగాల్లో ఎదుర్కుంటున్నారు. ఇదొక సామాజిక సమస్యలా మారిపోయింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వందలో 80 శాతంమంది మహిళల గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. ఇది మారాలి. మహిళల విలువను గుర్తించాలి. బాలీవుడ్ లో అసమానత అనే సంకెళ్ల నుంచి మహిళలంతా విముక్తి పొందాలి అని చెప్పుకొచ్చింది. నేహా శర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో లు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ ఆఫర్స్ లేక ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>