PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/happiness-in-the-eyes-of-the-grandparents-due-to-chandrababua38b1ed6-5ffc-4a0f-a7ae-31de90dec899-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/happiness-in-the-eyes-of-the-grandparents-due-to-chandrababua38b1ed6-5ffc-4a0f-a7ae-31de90dec899-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ తరుణంలోనే... నారా చంద్రబాబు నాయుడు... నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి పాలనపై దృష్టి పెట్టారు. అయితే... అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన వైసిపి ప్రభుత్వాన్ని... సూపర్ సిక్స్ ఫార్ములా తో పడగొట్టింది చంద్రబాబు కూటమి. సూపర్ సిక్స్ కారణంగానే... ఏపీ ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు వెళ్లారు. chandrababu{#}september;Telugu Desam Party;central government;CBN;Government;Andhra Pradesh;YCP;Bankచంద్రబాబు: సెప్టెంబర్‌ దాకా టీడీపీకి పండగే..ఆ తర్వాతే అసలు ఆట ?చంద్రబాబు: సెప్టెంబర్‌ దాకా టీడీపీకి పండగే..ఆ తర్వాతే అసలు ఆట ?chandrababu{#}september;Telugu Desam Party;central government;CBN;Government;Andhra Pradesh;YCP;BankThu, 20 Jun 2024 12:57:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ తరుణంలోనే... నారా చంద్రబాబు నాయుడు... నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి పాలనపై దృష్టి పెట్టారు. అయితే... అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన వైసిపి ప్రభుత్వాన్ని... సూపర్ సిక్స్ ఫార్ములా తో పడగొట్టింది చంద్రబాబు కూటమి. సూపర్ సిక్స్ కారణంగానే... ఏపీ ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు వెళ్లారు.


తెలుగుదేశం కూటమికి 164  స్థానాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు... అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది. అయితే.. ప్రస్తుతం ఏపీ అప్పు 13 లక్షల కోట్లకు దాటిందని  తెలుగుదేశం కూటమి సభ్యులే తరచూ చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే... భారీగా బడ్జెట్ ఖర్చవుతుంది.

అయితే ప్రస్తుతం... చంద్రబాబుకు అలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు ఆర్థిక నింపుణులు. సెప్టెంబర్ నెల వరకు ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకునే ఛాన్స్ ఉందట. ఎఫ్ ఆర్ బి ఎం  పరిధి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెప్టెంబర్ నెల వరకు రిజర్వ్ బ్యాంక్ అప్పులు ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం... చంద్రబాబుకు ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఎన్ని నిధులు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది.

అయితే సెప్టెంబర్ నెల తర్వాత... చంద్రబాబుకు అసలు అగ్ని పరీక్ష ప్రారంభం కానుందని  చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత ఏపీకి అప్పులు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ కూడా ముందుకు రాదని... అప్పుడు పథకాల అమలు సమస్యగా మారిపోతుందని అంటున్నారు. అలాంటి సమయంలో అమలు చేస్తున్న పథకాలలో కోత విధించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఏపీ బడ్జెట్ అసలు ఆ పథకాల అమలుకు సరిపోదని చెబుతున్నారు. మరి ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళతారో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>