PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ration-cardc0d60365-14b2-4bf1-a8a6-6a27515b0c5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ration-cardc0d60365-14b2-4bf1-a8a6-6a27515b0c5f-415x250-IndiaHerald.jpgఈ స్వతంత్ర భారత దేశంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఎక్కువ పథకాలను అమలు చేయడం జరుగుతోంది. తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లకు వీటి ద్వారా ఎక్కువ బెనిఫిట్ కలుగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇక్కడ కొన్ని పథకాలపట్ల ఎరుక కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆయా బెనిఫిట్స్ పొందకుండా పోతారు. ration card{#}Prime Minister;Application;central government;India;Governmentరేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే ఈ 5 పథకాలు వర్తిస్తాయి!రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే ఈ 5 పథకాలు వర్తిస్తాయి!ration card{#}Prime Minister;Application;central government;India;GovernmentWed, 19 Jun 2024 15:00:00 GMTఈ స్వతంత్ర భారత దేశంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఎక్కువ పథకాలను అమలు చేయడం జరుగుతోంది. తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లకు వీటి ద్వారా ఎక్కువ బెనిఫిట్ కలుగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇక్కడ కొన్ని పథకాలపట్ల ఎరుక కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆయా బెనిఫిట్స్ పొందకుండా పోతారు.

ఆయుష్మాన్ భారత్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,20,000 రూపాయలు సబ్సిడీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. దాదాపు 3 కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం కలదు. వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ కొత్త పథకం యొక్క బెనిఫిట్స్ ను సులువుగా పొందుతారు. తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ పొందడంతో పాటు 300 రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం చేతివృత్తులకు సంబంధించిన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు చేకూరుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశాలు కలవు. ఇక రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ఉచిత రేషన్ పొందే అవకాశం కలదనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయా కొత్త పథకాలకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>