Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap5b3f1bbd-0ea2-4028-8259-2380d619ba4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap5b3f1bbd-0ea2-4028-8259-2380d619ba4c-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయాల్లో మంత్రి పదవులు దక్కించుకోవాలంటే దాదాపు రెండు మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఇక మంచి పట్టున్న నేతలుగా ఎదిగితేనే ఆ అవకాశం దక్కుతుంది కానీ ఇటీవల ఏపీలో మాత్రం చంద్రబాబు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపిక అసెంబ్లీలో అడుగుపెట్టే వారికి సైతం మంత్రి పదవులను కట్టబెట్టారు. ఏకంగా యువకులకే తన క్యాబినెట్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయా నేతలు వారి బాధ్యతలను ఎలా నిర్వర్తించబోతుAp{#}anitha singer;Traffic police;marijuana;Party;Minister;Andhra Pradesh;CBN;YCP;TDPవంగలపూడి అనిత : ఏపీని మార్చబోతున్న టీచరమ్మ.. మార్పే ఆమె ప్రధాన ద్యేయం?వంగలపూడి అనిత : ఏపీని మార్చబోతున్న టీచరమ్మ.. మార్పే ఆమె ప్రధాన ద్యేయం?Ap{#}anitha singer;Traffic police;marijuana;Party;Minister;Andhra Pradesh;CBN;YCP;TDPWed, 19 Jun 2024 11:22:00 GMTసాధారణంగా రాజకీయాల్లో మంత్రి పదవులు దక్కించుకోవాలంటే దాదాపు రెండు మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఇక మంచి పట్టున్న నేతలుగా ఎదిగితేనే ఆ అవకాశం దక్కుతుంది  కానీ ఇటీవల ఏపీలో మాత్రం చంద్రబాబు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపిక అసెంబ్లీలో అడుగుపెట్టే వారికి సైతం మంత్రి పదవులను కట్టబెట్టారు. ఏకంగా యువకులకే తన క్యాబినెట్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద చదువులు చదివిన వారే ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయా  నేతలు వారి బాధ్యతలను ఎలా నిర్వర్తించబోతున్నారు అనే విషయంపైనే అందరి దృష్టి ఉంది.


 ఈ క్రమంలోనే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించారు వంగలపూడి అనిత. పిజి పూర్తి చేసిన ఆమె ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు ఇలా ఉపాధ్యాయురాలిగా జీవితాలను తీర్చిదిద్దిన ఆమె ఇక ఇప్పుడు ఏపీ శాంతి భద్రతలను చూసుకోవడంపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి ఏపీలో అక్రమ మద్యం, రవాణా, గంజాయి స్మగ్లింగ్ లాంటివి పెరిగిపోయాయి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు హోం శాఖ మంత్రిగా పోలీస్ శాఖను కంట్రోల్లో పెట్టుకున్న వంగలపూడి అనిత ఏపీని గంజాయి రహత రాష్ట్రంగా మార్చే అవకాశం ఉంది.


 మొన్నటి వరకు విద్యార్థులను సన్మార్గంలో నడిపించిన ఈ టీచరమ్మ.. ఇక ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖను సరైన దారిలో నడిపించబోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని శాంతి భద్రతలను కాపాడే దిశగా అడుగులు వేయబోతుంది. అంతేకాకుండా వైసిపి నేతలు టిడిపి కార్యకర్తలపై చేస్తున్న దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. సొంత పార్టీ కార్యకర్తల రక్షణ పై కూడా దృష్టి సారించబోతుంది. ఈ క్రమంలోనే ఇలా ఏపీ పోలీస్ బాస్ గా హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత.. తన బాధ్యతలను ఎలా నిర్వర్తించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఉన్నత చదువులు చదివి ఇప్పటికే టీచర్ వృత్తిలోకి వచ్చిన ఆమె.. ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా రాష్ట్ర రూపు రేకులు మార్చడంలో తనవంతు పాత్ర పోషించడం ఖాయమని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>