PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-dharavaram-minister-sathyakumarf3ce2af0-5882-478e-9e80-c0defc331641-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-dharavaram-minister-sathyakumarf3ce2af0-5882-478e-9e80-c0defc331641-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది ప్రజలు ఆరోగ్యాన్ని ఉచితంగా చేయించుకున్నారనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఈ పథకం ఎంతో మందికి ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ ఎన్నికవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజున అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో భారీగానే అవకతవకలు జరిగాయని కూడా వెల్లడించారు. తమ వర్గీయులకు సంబంధించి ఆసుపత్రులకు నిధులు దోచి పెట్టారని కూడా వెల్లడిBJP;DHARAVARAM;MINISTER;SATHYAKUMAR{#}Dharmavaram;Arogyasri;Kumaar;satya;Yevaru;Minister;Government;Bharatiya Janata Party;YCPఏపీ: ఆరోగ్యశ్రీపై.. మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు..!.ఏపీ: ఆరోగ్యశ్రీపై.. మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు..!.BJP;DHARAVARAM;MINISTER;SATHYAKUMAR{#}Dharmavaram;Arogyasri;Kumaar;satya;Yevaru;Minister;Government;Bharatiya Janata Party;YCPWed, 19 Jun 2024 06:26:00 GMTఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది ప్రజలు ఆరోగ్యాన్ని ఉచితంగా చేయించుకున్నారనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఈ పథకం ఎంతో మందికి ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ ఎన్నికవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజున అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో భారీగానే అవకతవకలు జరిగాయని కూడా వెల్లడించారు. తమ వర్గీయులకు సంబంధించి ఆసుపత్రులకు నిధులు దోచి పెట్టారని కూడా వెల్లడించారు.


సుమారుగా రూ.1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం గత ప్రభుత్వం పక్కదారి మళ్లించింది అంటూ సత్య కుమార్ విమర్శించడం జరుగుతోంది. వీటి పైన కచ్చితంగా విచారణ చేయవలసి ఉంటుంది. ఇందులో ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టమంటూ హెచ్చరించారు.మెడికల్ కాలేజీలో విషయంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు అంటూ తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ గైడ్లైన్స్ పరిగణంలోకి తీసుకోలేదని కేంద్రం మంజూరు చేసిన 17 మెడికల్ కళాశాలలో పునాదులు కూడా దాటలేదంటూ వెల్లడించారు.


అలాగే మొత్తం ఈ పనులన్నీ పూర్తి చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామంటూ మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిన సత్యకుమార్.. కూటమిలో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టారు. అందరూ నేతలు కూడా బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి వారి పనులలో బిజీగా మారిపోయారు. సత్య కుమార్ ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి ధర్మవరంలో బిజెపి పార్టీ నుంచి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా అక్కడ వైసిపి నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీద పోటీ చేసి మరి గెలిచారు సత్యకుమార్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>