PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/allagadda615c3f92-ecd5-482b-8332-4cc73cbd738e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/allagadda615c3f92-ecd5-482b-8332-4cc73cbd738e-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు జరగడం కొత్తేం కాదు. ఈసారి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ తమ్ముళ్లకి మధ్య చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. భూమా అఖిలప్రియ ఈసారి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. బిజేంద్రరెడ్డిని 12,037 ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడించారు. ఇటీవల ఆమె నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో టీడీపీ వాళ్లు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పూలు చల్లడానికి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారు టీడీపీ అభిమానులు. ఆపై పట్టణ శివారులో ఉన్న భూమా నాగిరెడ్డి, భూమా కుటుంబానికAllagadda{#}Bhuma Akhila Priya;Allagadda;Varsham;Andhra Pradesh;Cinema;TDPఆళ్లగడ్డలో హైటెన్షన్.. రాళ్లదాడితో రెచ్చిపోయిన ఆ లేడీ పొలిటిషన్‌ అనుచరులు..??ఆళ్లగడ్డలో హైటెన్షన్.. రాళ్లదాడితో రెచ్చిపోయిన ఆ లేడీ పొలిటిషన్‌ అనుచరులు..??Allagadda{#}Bhuma Akhila Priya;Allagadda;Varsham;Andhra Pradesh;Cinema;TDPWed, 19 Jun 2024 18:11:00 GMTతెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు జరగడం కొత్తేం కాదు. ఈసారి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ తమ్ముళ్లకి మధ్య చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. భూమా అఖిలప్రియ ఈసారి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. బిజేంద్రరెడ్డిని 12,037 ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడించారు. ఇటీవల ఆమె నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో టీడీపీ వాళ్లు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పూలు చల్లడానికి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నారు టీడీపీ అభిమానులు. ఆపై పట్టణ శివారులో ఉన్న భూమా నాగిరెడ్డి, భూమా కుటుంబానికి సంబంధించిన ఇతర రాజకీయ నేతల ఘాటుకు చేరుకుని అక్కడ నివాళులర్పించారు.

ఆళ్లగడ్డకు టీడీపీ శ్రేణులు చేరుకొని పట్టణంలోకి వస్తున్నప్పుడు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించిన హోటల్ ఫంక్షన్ హాల్ పై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత ఏవీ సుబ్బారెడ్డి ప్లాజా పై కూడా మూకుమ్మడిగా రాళ్ల వర్షం కురిపించారు. వాళ్లు రాళ్లు విసిరాక భవంతుల అద్దాలు పగిలిపోయాయి దీనివల్ల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆ టీడీపీ నేతకు చెందిన హోటల్, సినిమా హాలు, ఫంక్షన్ హాల్ కి వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనతో మరోసారి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ అధిష్టానం ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తుందేమో అని భావించారు కానీ అది జరగలేదు. ఏవీ సుబ్బారెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డ తర్వాత అది భూమా అఖిలప్రియ కు వెళ్ళిపోయింది. అయితే టిడిపి అధికారంలోకి రావడం అఖిల ప్రియ కూడా గెలవడం వల్ల అనుచరులు ఆమె అంటే పడని సుబ్బారెడ్డి వ్యాపారాలపై దాడులకు తెగబడుతున్నారు.

ఇలా చేయడం వల్ల వారికి మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అధికారంలో లేని ప్రతి ఒక్కరూ వ్యాపారాలను ఇక్కడ నడపలేకపోతే చివరికి ఏపీలో పాడుబడ్డ వ్యాపార సంస్థలు మిగిలిపోతాయి. ఎవరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేయలేరు. అప్పుడు ఉపాధి అవకాశాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు. దాడులు చేసేవారిని పిల్లలే చివరికి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లాల్సిన దయనీయమైన రోజులు వస్తాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా బలం, అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>