MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mmd-letest-update-fresh-news3a4b6dae-1a0e-46fb-be4b-b57705051c34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mmd-letest-update-fresh-news3a4b6dae-1a0e-46fb-be4b-b57705051c34-415x250-IndiaHerald.jpgసింగర్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో అనేక సినిమాలలో నటించి ఈ బ్యూటీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నటించిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న మూవీ యమదొంగ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ రెండవ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కmmd{#}Mamta Mohandas;Jr NTR;nayantara;Rajani kanth;Rajamouli;Cancer;vijay sethupathi;Telugu;Heroine;BEAUTY;Box office;Cinemaఆ మూవీలో అనవసరంగా నటించా... షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్..!ఆ మూవీలో అనవసరంగా నటించా... షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా మోహన్ దాస్..!mmd{#}Mamta Mohandas;Jr NTR;nayantara;Rajani kanth;Rajamouli;Cancer;vijay sethupathi;Telugu;Heroine;BEAUTY;Box office;CinemaWed, 19 Jun 2024 16:40:00 GMTసింగర్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో అనేక సినిమాలలో నటించి ఈ బ్యూటీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నటించిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న మూవీ యమదొంగ. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ రెండవ హీరోయిన్ గా నటించింది.

ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ సినిమా తర్వాత ఈమె అనేక తెలుగు సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమెకు క్యాన్సర్ రావడంతో కొంత కాలం పాటు ఈ నటి సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందిన మహారాజా సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మూవీ జూన్ 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఓ సినిమా అనవసరంగా చేశాను. ఆ సినిమా చేయకపోయి ఉంటే చాలా బాగుండేది అని చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏది... ఎందుకు చేసి ఉండకపోతే బాగుండేది అని ఈ ముద్దుగుమ్మ అంది అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన కుసేలన్ మూవీలో నటించాను. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించగా ... నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో నేను ఒక సాంగ్ చేశాను. ఈ సాంగ్ కోసం రెండు రోజుల షూట్ చేశారు. అయితే ఎడిటింగ్ లో నా పార్ట్ ను డిలీట్ చేశారు. కేవలం అతి తక్కువ నిడివి లో మాత్రమే నా పాత్ర కనిపించింది. దాంతో అసలు ఈ మూవీ ఎందుకు చేశానా అని బాధపడినట్లు మమతా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>